సినిమా వార్తలు

పూరి మార్క్‌ ఊచకోత.. ‘స్లమ్ డాగ్ – 33 టెంపుల్ రోడ్’లో కొత్త అవతారంలో విజయ్ సేతుపతి

Published by
Srinivas

డేరింగ్ దర్శకుడు Puri Jagannadh మరియు నేషనల్ అవార్డ్ విన్నర్ Vijay Sethupathi కలయికలో రూపొందుతున్న పాన్‌ ఇండియా సినిమా ఇప్పటికే భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. ‘#PuriSethupathi’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్ దశలో ఉంది.

ఈ సినిమాను పూరి జగన్నాథ్, Charmme Kaur కలిసి Puri Connects బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. అలాగే JB Mohan Pictures తరఫున జేబీ నారాయణరావు కొండ్రొల్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

విజయ్ సేతుపతి పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. సినిమాకు ‘Slum Dog – 33 Temple Road’ అనే పవర్‌ఫుల్ టైటిల్ ఖరారుకాగా, ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిందరవందర జుట్టు, గడ్డం, భిక్షగాడి వేషంలో చేతిలో భారీ కొడవలి పట్టుకుని, చుట్టూ నోట్ల గుట్టలు ఎగిరిపడుతున్న డార్క్ స్లమ్ బ్యాక్‌డ్రాప్ సినిమాపై ఆసక్తిని అమాంతం పెంచింది.

హీరోలను పూర్తిగా కొత్తగా చూపించడంలో పూరి జగన్నాథ్‌కు ప్రత్యేకమైన మార్క్ స్టైల్ ఉందన్న విషయం తెలిసిందే. ‘స్లమ్ డాగ్ – 33 టెంపుల్ రోడ్’లో విజయ్ సేతుపతిని ఇప్పటివరకు ఎప్పుడూ చూడని విధంగా, రా అండ్ రగ్డ్ అవతారంలో ఆవిష్కరించారు. ఈ పాత్ర ఆయన కెరీర్‌లోనే అత్యంత డిఫరెంట్ క్యారెక్టర్‌గా నిలవనుందన్న టాక్ వినిపిస్తోంది.

ఈ చిత్రంలో కథానాయికగా Samyuktha నటిస్తుండగా, ప్రముఖ నటి Tabu మరియు కన్నడ స్టార్ Duniya Vijay Kumar కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అలాగే Brahmaji, VTV Ganesh ప్రత్యేక పాత్రల్లో హాస్యాన్ని అందించనున్నారు.

సంగీత విభాగంలోనూ ఈ సినిమాకు బలమైన అస్త్రం ఉంది. ‘అర్జున్ రెడ్డి’, ‘అనిమల్’ వంటి చిత్రాలతో తన ప్రత్యేక బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు గుర్తింపు తెచ్చుకున్న నేషనల్ అవార్డ్ విజేత Harshavardhan Rameshwar ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

‘స్లమ్ డాగ్ – 33 టెంపుల్ రోడ్’ను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు. పూరి మార్క్ ఇంటెన్స్ కథనం, విజయ్ సేతుపతి పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ కలయికలో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

Recent Posts