
టాలీవుడ్‌లో మరో సెన్సేషనల్ కలయిక రూపుదిద్దుకుంది. ‘యానిమల్’ సినిమాతో దేశవ్యాప్తంగా తన ప్రత్యేక మ్యూజిక్ సిగ్నేచర్‌ను ముద్రించిన మ్యూజిక్ సెన్సేషన్ హర్షవర్ధన్ రామేశ్వర్, ఇప్పుడు డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కొత్త చిత్రానికి సంగీతం సమకూర్చనున్నారు. ఈ చిత్రంలో నేషనల్ అవార్డ్ విన్నర్ విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్నారు.
తాజాగా చిత్ర బృందం హర్షవర్ధన్ రామేశ్వర్ ను అధికారికంగా స్వాగతించింది. “మాటల కంటే శబ్దంతో మాట్లాడే బ్లాక్‌బస్టర్ కంపోజర్” అంటూ ఆయనను సత్కరించింది. ఈ ప్రకటనతోనే సినిమా చుట్టూ భారీ అంచనాలు నెలకొన్నాయి.
‘స్లమ్‌డాగ్’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రం తెలుగు–తమిళ ద్విభాషా ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోంది. మాస్, ఎమోషన్, ఎనర్జీ మేళవింపుతో నడిచే ఈ యాక్షన్ ఎంటర్టైనర్‌లో విజయ్ సేతుపతికి తోడుగా టబు కీలక పాత్రలో, సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.
హర్షవర్ధన్ రామేశ్వర్ ఇప్పటికే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ‘యానిమల్’కు సంగీతం అందించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. అలాగే ప్రస్తుతం ప్రభాస్ హీరోగా వస్తున్న ‘స్పిరిట్’ సినిమాకు కూడా ఆయనే మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పుడు పూరీ జగన్నాథ్‌తో ఆయన జట్టుకట్టడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ ప్రాజెక్ట్‌ను పూరీ జగన్నాథ్ మరియు చార్మీ కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సోషల్ మీడియాలో సినిమా టీమ్ ఇలా ప్రకటించింది —
పూరీ జగన్నాథ్ మాస్ స్టోరీటెల్లింగ్, విజయ్ సేతుపతి వెర్సటిలిటీ, హర్షవర్ధన్ రామేశ్వర్ ఎలక్ట్రిఫైయింగ్ మ్యూజిక్ – ఈ ముగ్గురి కాంబినేషన్ మీద టాలీవుడ్ మొత్తం దృష్టి సారించింది.
