యువ హీరో Aadi Saikumar నటించిన రీసెంట్ సూపర్ హిట్ మిస్టికల్ థ్రిల్లర్ ‘శంబాల’ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. థియేటర్లలో మంచి విజయం సాధించిన ఈ సినిమా, ఈ నెల 22వ తేదీ నుంచి ahaలో స్ట్రీమింగ్‌కు రానుంది.
ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఆహా గోల్డ్ సబ్‌స్క్రైబర్స్‌కు ఒక రోజు ముందుగానే ఎర్లీ యాక్సెస్ అందించనున్నారు. ఎప్పటికప్పుడు కొత్తగా, ఎగ్జైటింగ్ కంటెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఆహా ఓటీటీ, ‘శంబాల’తో మరోసారి కొత్త సబ్‌స్క్రైబర్లను ఆకర్షించేందుకు సిద్ధమైంది.
గతేడాది డిసెంబర్ 25న థియేటర్లలో విడుదలైన ‘శంబాల’ మిస్టికల్ థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని దర్శకుడు Yugandhar Muni తెరకెక్కించగా, హీరోయిన్‌గా Archana Iyer నటించారు.
ఈ మూవీని షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు సంయుక్తంగా నిర్మించారు. సినిమాటోగ్రాఫర్ ప్రవీణ్ కె బంగారి అందించిన విజువల్స్, సంగీత దర్శకుడు Sri Charan Pakala అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచాయి.
థియేటర్లలో మంచి వసూళ్లు రాబట్టిన ‘శంబాల’, ఇప్పుడు ఓటీటీ వేదికపై మరింత విస్తృత ప్రేక్షకులను చేరుకునే అవకాశం ఉంది. ఆహాలో ‘శంబాల’ ప్రీమియర్‌కు ప్రేక్షకులు ఇప్పటికే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.