‘పెద్ది’ డైరెక్టర్ బుచ్చి బాబు సన మెగా అభిమానులకు బూస్ట్ ఇచ్చారు. ‘పెద్ది’ సినిమా నుంచి ఫస్ట్ లవ్ సాంగ్ రాబోతోందనే విషయం చెప్పడంతో ఫ్యాన్స్ ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు. ఇటీవల ‘డ్యూడ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు బుచ్చి బాబు సన ఈ అప్‌డేట్‌ని రివీల్ చేయగా, ప్రేక్షకుల్లో సంబరాలు మొదలయ్యాయి.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సనసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు పెద్ది చిత్రంలో. కాగా, సంగీతం ఆస్కార్ విజేత ఏఆర్. రెహ్మాన్ అందించారు. మొదటి లవ్ సాంగ్‌లోని మ్యూజిక్, విజువల్స్, ఎమోషన్ అన్నీ పర్ఫెక్ట్ రొమాంటిక్ వైబ్స్‌ను పంచనున్నాయని యూనిట్ చెబుతోంది.
ఇటీవల హీరో రామ్ చరణ్ ఎత్తైన కొండల మీద బండరాళ్ల మీద, చెట్టు కొమ్మ అంచున చేసిన డ్యాన్స్ సీక్వెన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ అద్భుతమైన లొకేషన్, కెమెరా వర్క్ చూసిన ప్రేక్షకులు “ఇది విజువల్ ట్రీట్ అవుతుందనిపిస్తోంది!” అని కామెంట్ చేస్తున్నారు.
ఫస్ట్ షాట్ నుంచే ఈ సినిమా మీద ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. ప్రేమ, పల్లెటూరు జీవితం, యూత్ ఎనర్జీ కలగలిపిన ఈ ప్రేమ గీతం యూత్ హార్ట్‌లలో తుఫాన్ రేపబోతోందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
బుచ్చి బాబు సన — సుకుమార్ శిష్యుడిగా పరిచయమైన ఈ డైరెక్టర్, తన తొలి చిత్రం ఉప్పెనతోనే అందరినీ ఆకట్టుకున్నారు. ఇప్పుడు పెద్ధితో ఆయన మరోసారి ప్రేమ, సంగీతం కలయికను తెరపై చూపించబోతున్నారు.
రామ్ చరణ్ – రెహమాన్ కాంబోలో వస్తున్న ఫస్ట్ చిత్రమిది. సో, రెహమాన్ సంగీతమంటే చెప్పేదేముంది.. ఇక థియేటర్లలో ఈ లవ్ సాంగ్ కి గూస్‌బంప్స్ ఖాయమని ఫాన్స్ చెబుతున్నారు .
ఫస్ట్ లవ్ సాంగ్ విడుదల తేదీకి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది. కానీ ఇప్పటినుంచే సోషల్ మీడియాలో “#PeddiFirstLoveSong” హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.