తమిళ స్టార్ హీరో సూర్య మరో ప్రతిష్టాత్మక పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. ‘జై భీమ్’ దర్శకుడు టి.జే. జ్ఞానవేల్ దర్శకత్వంలో, హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి చెన్నైలో ఘనంగా పూజా కార్యక్రమం నిర్వహించారు. దీంతో భారతీయ సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ కాంబినేషన్ అధికారికంగా సెట్స్‌పైకి వెళ్లింది.
జూన్ 29న చెన్నైలోని పార్క్ హయత్ హోటల్‌లో జరిగిన ముహూర్త కార్యక్రమంలో సూర్య, దర్శకుడు టి.జే. జ్ఞానవేల్, హీరోయిన్ కాయదు లోహర్, నిర్మాత విజయ్ కిరగందూర్తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పూజా కార్యక్రమం ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
హోంబలే ఫిల్మ్స్ అధినేత విజయ్ కిరగందూర్ మాట్లాడుతూ, “సూర్య గారు, టి.జే. జ్ఞానవేల్ గారితో కలిసి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునే అర్థవంతమైన కథను తెరకెక్కించబోతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. గొప్ప సినిమాలు ఒకే లక్ష్యంతో పనిచేసే అంకితభావం ఉన్న టీమ్ వల్లే సాధ్యమవుతాయి” అని తెలిపారు.
రెండు దశాబ్దాలుగా విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న సూర్య.. ఇప్పుడు ‘జై భీమ్’ వంటి విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిత్రాన్ని తెరకెక్కించిన టి.జే. జ్ఞానవేల్‌తో చేతులు కలపడం ఈ ప్రాజెక్ట్‌కు మరింత ప్రత్యేకత తీసుకొచ్చింది.
ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తుండగా, ఎస్.ఆర్. కదిర్ సినిమాటోగ్రఫీ, కె. కదిర్ ప్రొడక్షన్ డిజైన్, ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
‘కేజీఎఫ్’, ‘కాంతార’, ‘సలార్’ వంటి పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్లను అందించిన హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం సూర్య కెరీర్‌లోనే అత్యంత భారీ చిత్రాల్లో ఒకటిగా నిలవనుంది. కథ, తారాగణం, సాంకేతిక బృందం పరంగా ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.