సినిమా వార్తలు

‘త్రిబాణధారి బార్బరిక్’ రిలీజ్ డేట్ ఖరారు

Published by
Srinivas

మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో, సత్యరాజ్ ప్రధాన పాత్ర పోషిస్తోన్న చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. వశిష్ట ఎన్ సింహా, సత్యం రాజేష్, ఉదయభాను, క్రాంతి కిరణ్, సాంచీ రాయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో, విజయ్ పాల్ రెడ్డి అడిదెల నిర్మాణంలో, వానర సెల్యూలాయిడ్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా వచ్చిన ట్రైలర్ మాత్రం అంచనాలను మరింత పెంచేసింది. విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మోహన్ శ్రీవత్స మేకింగ్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇన్‌ఫ్యూజన్ బ్యాండ్ సంగీతం, ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన పాటలు మంచి స్పందన తెచ్చుకున్నాయి.

త్రిబాణధారి బార్బరిక్ చిత్రబృందం తమ మూవీని ఆగస్ట్ 29న గ్రాండ్‌గా విడుదల చేయాలని ఖరారు చేసింది.

కొత్త ప్రొడ్యూసర్ అయినప్పటికీ, విజయ్ పాల్ రెడ్డి ఎక్కడా రాజీ పడకుండా భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించారు. ముఖ్యంగా కుశేందర్ రమేష్ రెడ్డి అందించిన విజువల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. “బార్బరిక్ కాన్సెప్ట్” ఇప్పటికే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. విభిన్న ప్రమోషన్లతో సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తున్నారు.

మొదట ఈ చిత్రం ఆగస్ట్ 22న విడుదల కావాల్సి ఉన్నా, సరైన రిలీజ్ డేట్, కావాల్సిన థియేటర్లు దొరకడం కోసం వారం వాయిదా వేశారు. ఇక ఇప్పుడు త్రిబాణధారి బార్బరిక్ ఆగస్ట్ 29న ప్రేక్షకుల ముందుకు గ్రాండ్‌గా రానుంది.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.