సినిమా వార్తలు

నిన్ను చాలా మిస్ అవుతున్నాం.. నమ్రత పోస్ట్ వైరల్

Published by
Srinivas

ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న #SSMB29 చిత్రం బిజీ షెడ్యూల్ చిత్రీకరణలో ఉన్నారు. అందువల్ల ఈ ఏడాది గణేశ్ చతుర్థి సందర్భంగా కుటుంబంతో కలిసి చేసుకోలేకపోయారు. అయితే ఆయన భార్య నమ్రత శిరోద్కర్ తమ ఇంటి పండుగ వాతావరణాన్ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. ఇంట్లో ప్రతిష్టించిన గణేశుడి విగ్రహం దగ్గర నమ్రత, కుమారుడు గౌతమ్, కుమార్తె సితారలతో కలిసి దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తాము ఎంతగానో మిస్ అవుతున్నానని మహేశ్ బాబు కోసం నమ్రత తెలిపింది. ఆమె పోస్ట్‌లో, “బప్పా ఇంటికి వచ్చారు.. మేమందరం సంతోషంగా ఉన్నాం. అందరికీ ప్రేమ, శాంతి, ఐశ్వర్యం కలగాలని కోరుకుంటున్నాను! @urstrulymahesh నిన్ను చాలా మిస్ అవుతున్నాం” అంటూ లవ్ ఎమోజీలతో రాసింది.

ప్రస్తుతం మహేశ్ బాబు దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న గ్లోబ్ ట్రాటర్ #SSMB29 చిత్రంలో నటిస్తున్నారు. ఈ భారీ యాక్షన్-అడ్వెంచర్ డ్రామాలో ప్రియాంకా చోప్రా హీరోయిన్‌గా నటిస్తోంది.

రాజమౌళి ఇప్పటికే ప్రకటించినట్టుగా, గ్లోబ్ ట్రాటర్ సినిమా గ్లింప్స్ వీడియో నవంబరులో విడుదల కానుంది. ఈ సినిమా 2027లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

Recent Posts