సినిమా వార్తలు

మిరాయ్ ట్రైలర్: “ఎక్కడినుండి పడతావయ్యా ఇలాంటి స్టోరీస్ ?”

Published by
Srinivas

హను-మాన్ తో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన హీరో తేజ సజ్జ, మరోసారి సూపర్ హీరో లుక్‌లో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న “మిరాయ్ – సూపర్ యోధ” ట్రైలర్ విడుదలై, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

మిరాయ్ ట్రైలర్ రిలీజ్ అయిన మూడు గంటల్లోనే మిలియన్ వ్యూస్ దాటి పరుగెడుతోంది. కాగా ట్రైలర్ చూసిన ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. విజువల్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సూపర్ గా ఉన్నాయని, అసలు ఎక్కడినుండి పడతావయ్యా ఇలాంటి స్టోరీస్ అని ఒకరు, స్టార్స్ అందరూ రొట్ట స్టోరీస్ తీసి 500 కోట్ల బడ్జెట్ అని అంటుంటే విజువల్ వండర్స్ కంట్రోల్ బడ్జెట్ తో బ్లాక్ బస్టర్ కొడుతున్నవ్ స్వామి అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు.

ట్రైలర్‌లో తేజ సజ్జ యోధగా పరిచయం అవుతాడు. ధర్మాన్ని కాపాడే ఈ యోధుడి ఎదుట నిలిచేది మంచు మనోజ్ పోషించిన బ్లాక్ స్వోర్డ్. అతను బ్లాక్ మేజిక్ శక్తులను సాధించి, రాజు అశోకుడి తొమ్మిది పవిత్ర గ్రంథాలను సంపాదించి ప్రపంచాన్ని కబళించాలనుకుంటాడు. ఈ దుష్టశక్తిని ఎదుర్కొని, శ్రీరాముడి త్రేతా యుగంలో రూపొందిన దివ్యాస్త్రం ‘మిరాయ్ ని స్వీకరించి చెడును అంతం చేయమని ధర్మశాల రక్షకులు యోధుడిని పిలుస్తారు.

ట్రైలర్ విజువల్స్ అద్భుతంగా ఆకట్టుకున్నాయి. గ్రావిటీని తలదన్నే స్టంట్స్, భారీ యుద్ధ సన్నివేశాలు, ప్రపంచస్థాయి విజువల్ ఎఫెక్ట్స్ హాలీవుడ్ రేంజ్‌లో ఉన్నాయి. చివర్లో కనిపించిన గరుత్మంతుడి ఈగిల్ షాట్తో పాటు శ్రీరాముడి గ్లింప్స్ ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పిస్తాయి.

గౌర హరి అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రతి సన్నివేశానికి శక్తిని పంచి, ట్రైలర్‌ను మరింత ఎత్తుకు తీసుకెళ్లింది.

తేజ సజ్జ హీరోయిక్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకోగా, మంచు మనోజ్ విలన్‌గా ఇంటెన్స్‌గా కనిపించాడు. జగపతి బాబు, రితికా నాయక్, జయరామ్, శ్రియా శరణ్ వంటి తారాగణం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

“మిరాయ్ – సూపర్ యోధ” ట్రైలర్, మిథాలజీ, యాక్షన్, హై-ఎండ్ VFXల మేళవింపుతో ఇండియన్ సూపర్ హీరో సినిమాల్లో కొత్త మైలురాయిగా నిలిచేలా ఉందని స్పష్టమవుతోంది. ఈ స్థాయి స్పెక్టకిల్‌ను తెరపైకి తెస్తూ, టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం, సెప్టెంబర్ 12, 2025న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.