సినిమా వార్తలు

‘టాక్సిక్’లో యష్ డబుల్ షాక్ – ‘టికెట్ టు హెల్’తో మరో సంచలనం!

Published by
Srinivas

‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ నుంచి మరో సంచలన అప్డేట్ వచ్చింది. రాకింగ్ స్టార్ Yash తాజాగా క్లీన్-షేవ్ లుక్‌లో ‘టికెట్ టు హెల్’గా పరిచయమయ్యారు. ముందుగా విడుదలైన గడ్డం లుక్ ‘రాయ’ సోషల్ మీడియాలో భారీ ట్రెండ్ సృష్టించగా, ఇప్పుడు పూర్తిగా విభిన్నంగా కనిపిస్తున్న ‘టికెట్’ అవతార్ కథలో డబుల్ రోల్ అంశంపై ఆసక్తిని మరింత పెంచింది.

‘రాయ’ రఫ్ అండ్ ఇంటెన్స్ లుక్ అయితే, ‘టికెట్’ మాత్రం సింపుల్‌గా కనిపిస్తూ లోపల దాగి ఉన్న డార్క్ షేడ్‌ను సూచిస్తున్నట్టు పోస్టర్ చెబుతోంది. ఈ రెండు పాత్రల మధ్య ఉన్న సంబంధం ఏమిటి? కథ రెండు టైమ్‌లైన్స్‌లో నడుస్తుందా? అనే ప్రశ్నలు అభిమానుల్లో చర్చకు దారి తీస్తున్నాయి.

ఇప్పటికే విడుదలైన టీజర్ కేవలం 24 గంటల్లో 197 మిలియన్ వ్యూస్ సాధించి రికార్డు సృష్టించింది. భారత్‌తో పాటు పలు దేశాల్లో ట్రెండింగ్‌లో నిలిచి ‘టాక్సిక్’ గ్లోబల్ రీచ్‌ను చాటిచెప్పింది. రెండు నిమిషాల కన్నా తక్కువ నిడివి ఉన్న టీజర్‌ను ఫ్యాన్స్ ఫ్రేమ్ బై ఫ్రేమ్ విశ్లేషిస్తూ సోషల్ మీడియాలో అనేక థియరీలు పంచుకుంటున్నారు.

నేషనల్ అవార్డ్ విజేత Geetu Mohandas దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని KVN Productions మరియు Monster Mind Creations నిర్మిస్తున్నాయి. కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో కూడా విడుదల కానుంది.

భారీ అంచనాల మధ్య ‘టాక్సిక్’ 2026 మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ‘రాయా’ తర్వాత ‘టికెట్’ ఎంట్రీతో యష్ ఈసారి ఎలాంటి సంచలనం సృష్టిస్తారో చూడాలి.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.