సినిమా వార్తలు

‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’… రిలీజ్ టైమ్ కన్ఫర్మ్

Published by
Srinivas

పవర్ స్టార్ Pawan Kalyan హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. దర్శకుడు Harish Shankarతో కలిసి ‘గబ్బర్ సింగ్’ తర్వాత వస్తున్న ఈ సినిమా కావడంతో అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది.

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సాంగ్ సోషల్ మీడియాలో భారీ ట్రెండ్ సృష్టిస్తోంది. ఇక ఇప్పుడు రెండో సాంగ్ ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ పాటను ఫిబ్రవరి 22న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

హైదరాబాద్‌లోని మల్లారెడ్డి కాలేజ్‌లో మధ్యాహ్నం 3:30 గంటలకు గ్రాండ్ ఈవెంట్ నిర్వహించి సాంగ్‌ను లాంచ్ చేయనున్నారు. ఇదే సమయంలో ఆన్‌లైన్ రిలీజ్‌పై కూడా క్లారిటీ ఇచ్చారు. యూట్యూబ్ సహా అన్ని డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో ఈ పాట సాయంత్రం 5:35 గంటలకు విడుదల కానుంది.

ఈసారి సంగీత దర్శకుడు Devi Sri Prasad పవర్ స్టార్ కోసం ఎలాంటి మ్యూజికల్ ఫీస్ట్ సిద్ధం చేశారో చూడాలి. భారీ నిర్మాణ సంస్థ Mythri Movie Makers నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 26న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. అభిమానులందరూ ఇప్పుడు ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ కోసం కౌంట్‌డౌన్ ప్రారంభించారు.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.