418

Published by
Srinivas

‘418’ సినిమా టైటిల్ ఇంట్రస్టింగ్. జానర్ వచ్చేసి హారర్. ప్రేక్షకులు చాలా మంది ఈ జానర్‌ను చాలా ఇష్టపడతారు. ప్రేక్షకులను బాగా భయపెట్టగలిగితే చాలు సినిమా సక్సెస్. ఈ సినిమా విషయంలో ప్రేక్షకులను మరింత అట్రాక్ట్ చేసినది మరొకటి ఉంది. అదే ప్రశాంత్ నీల్ ఈ సినిమాను ప్రెజెంట్ చేయడం. ఆయన దగ్గర పని చేసిన కీర్త‌న్ నాద‌గౌడ ఈ సినిమాకు దర్శకత్వం వహించడం కూడా ఆసక్తికరంగా మారింది. ఇంతకు మించి సినిమాపై అంచనాలు పెరగడానికి ఏం కావాలి? ఆసక్తికరంగా భారీగా అంచనాలు పెరిగాయి. మరి సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం.

కథేంటంటే…

ఊరికి దూరంగా ఉన్న ఓ మెడిక‌ల్ క‌ళాశాల హాస్ట‌ల్‌ను మూత‌ప‌డిన 15 ఏళ్ల త‌ర్వాత తిరిగి తెరుస్తారు. హాస్టల్‌ను తెరవడానికి అయితే తెరుస్తారు కానీ దానిలోని 418 నంబ‌ర్ గ‌దిని మాత్రం మూసివేసే ఉంచుతారు. ఆ గ‌ది పేరెత్తితేనే దాని గురించి తెలిసిన వాళ్లకు వెన్నులో నుంచి వణుకు పుడుతుంది. ఆ హాస్ట‌ల్‌లోకి మ‌హిళ‌ల‌కు ప్ర‌వేశం ఉండ‌దు. దీనికి కారణం కూడా ఆ గదే. అయితే వివేక్  (సూర్య రాజ్ ) అనే స్టూడెంట్ దానికి ముందున్న గది అయిన 417 లోకి వస్తాడు. అక్కడి నుంచి అసలు కథ ప్రారంభమవుతుంది. వివేక్‌కు ఏవేవో భయంకర దృశ్యాలు కనిపించడం.. పీడ కలలు రావడం.. అత‌డిపై హ‌త్యాయ‌త్నం కూడా జ‌రుగుతుంది. వీటన్నింటికీ కారణం 418 నంబ‌ర్ గ‌దేనని ఆ త‌ర్వాత వివేక్‌కు అర్థ‌మ‌వుతుంది. అసలు ఆగదిలో ఏముంది? ఎందుకు దాని పేరు వింటేనే భయపడుతున్నారు? ఆ గదికి పక్కనున్న వివేక్‌కు ఎందుకలా జరిగింది? లండ‌న్ నుంచి వ‌చ్చిన సాయేషా (ప్రీతి ప‌గ‌డాల‌) ఆ గ‌దిలోకి వెళ్ల‌డానికి ప్ర‌య‌త్నించాక ఏం జ‌రిగింది? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే..

మూత‌ప‌డిన బంగ్లా అందులో ఏదో భయానకంగా జరుగుతుండటం వంటివి ఇప్పటికే చాలా సినిమాల్లో చూశాం. అసలు హారర్ కథలన్నీ కూడా దాదాపుగా ఈ కోవకు చెందినదే. రొటీన్ స్టోరీ. అయితే కాస్త భిన్నంగా దీనిని తీసుకెళ్లారు. ఆరంభ సన్నివేశంతోనే దర్శకుడు ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్లారు. సినిమా ఆసాంతం భయపెట్టదు కానీ కొన్ని సన్నివేశాలు మాత్రం భయపెడతాయి. అలాగే కొన్ని జంప్ స్కేర్స్ ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా నిశ్శబ్దంగా సాగే సన్నివేశాలు ఉత్కంఠకు గరి చేస్తాయి. సినిమా అంతటా ఓ భయానక వాతావరణాన్ని మెయిన్‌టైన్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యానే చెప్పాలి. య‌క్ష‌గానం క‌ళ‌, క‌థ‌లోని సైక‌లాజిక‌ల్ కోణం కూడా కొంత మేర ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. వివేక్ 417 రూంలోకి చేరడం.. ఆ తరువాత అతను ఎదుర్కొన్న పరిస్థితులు సినిమాను ఆసక్తకిరంగా మార్చేస్తాయి. సెకండాఫ్ తర్వాత దేవిక పాత్ర ఉంటుంది. ఆమె ఫ్లాష్‌బ్యాక్ ప్రేక్షకులను కదిలిస్తుంది. ఆమె పాత్రే సినిమాకు కీలకం. కొన్ని సన్నివేశాలను దర్శకుడు మరింత బాగా తెరకెక్కించి ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. చెప్పదలుచుకున్న విషయంలో దర్శకుడు కొంత తడబడినట్టుగా అనిపిస్తుంది. సినిమా బాగోలేదు అని చెప్పలేం కానీ ఓవరాల్‌గా చూస్తే మాత్రం పర్వాలేదనిపించింది.

ఎవరెలా నటించారు? టెక్నికల్ పరంగా…

ప్ర‌ధాన పాత్ర‌ల కోసం కొత్త నటీనటులను తీసుకోవడం సినిమాకు కలిసొచ్చిన అంశం. ముఖ్యంగా చైత్ర ఆచార్ చాలా బాగా నటించింది. సూర్య‌రాజ్‌ కూడా తన పాత్రలో ఒదిగిపోయాడు. చ‌ర‌ణ్ ల‌క్క‌రాజు, ప్రీతి ప‌గ‌డాల త‌దిత‌రులు చక్కగా నటించారు. సాంకేతిక పరంగా సినిమా గురించి చెప్పాలంటే ముఖ్యంగా బీజీఎం గురించి చెప్పాలి. చాలా హాంటింగ్‌గా ఉంది. కొన్ని సన్నివేశాల్లో మ్యూజిక్.. మనమే ఆ పరిస్థితుల్లో ఉన్న ఫీల్‌ను తీసుకొచ్చిది. బీజీఎం సినిమాకు ప్రధాన బలం అనడంలో సందేహం లేదు. దర్శకుడు కొన్ని సన్నివేశాలను మరింత ఆసక్తికరంగా తీసుకెళ్లి ఉంటే బాగుండేది. ఎడిటింగ్ విషయంలో కాస్త శ్రద్ధ పెట్టాల్సింది. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.

ఫైనల్‌గా..

418 సూపర్ అని చెప్పలేం కానీ పర్వాలేదు.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

Share
Published by
Srinivas

Recent Posts

కల్ట్

అక్టోబర్ 30, 2026

కిల్లర్

అక్టోబర్ 30, 2026

నా వైఫ్ మిస్సింగ్

అక్టోబర్ 25, 2026

హైకూ

అక్టోబర్ 23, 2026

గరివిడి లక్ష్మి

అక్టోబర్ 17, 2026