కిల్లర్

Published by
Srinivas

జ్యోతి పూర్వజ్, పూర్వజ్ ప్రధాన పాత్రల్లో నటించిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమా ‘కిల్లర్’ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాపై ముందు నుంచి అయితే అంచనాలు పెద్దగా లేవు కానీ.. ప్రొడ్యూసర్ కోటి రూపాయల కంటెస్ట్ ప్రారంభించి సినిమాను టాక్ ఆఫ్ ది టౌన్ చేశారు. మైథాలజీ, సైన్స్ ఫిక్షన్, సూపర్ హీరో కాన్సెప్ట్‌తో సైంటిఫిక్, ఫిక్షన్‌గా రూపొందిన ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను ఆకట్టుకుందా? తెలుసుకుందాం.

కథేంటంటే…

ఓ మహిళ పడిపోయి ఉంటుంది. ఆమెపై ఎవరో ఎటాక్ చేసినట్టుగా ఉంటుంది. విషయం తెలుసుకున్న ఆమె తమ్ముడు కార్తీక్ (చందు).. స్నేహితుడు (దశరధ మాధవ్)తో కలిసి వెళ్లి అక్కను తీసుకొచ్చి హాస్పిటల్‌లో జాయిన్ చేస్తాడు. అక్కడ ఫలితం ఉండదని తెలుసుకుని.. తన అక్క కోలుకోవాలంటే సైంటిస్ట్ డాక్టర్ పూర్వజ్ దగ్గరకు తీసుకెళ్లాలని తెలుసుకుంటాడు. అక్కడకు కార్తీక్ తన అక్కను తీసుకెళతాడు. మరోవైపు పూర్వజ్ తన అసిస్టెంట్ గాయత్రి మూర్తితో కలిసి అక్కడ జరుగుతున్న వరుస హత్యలపై ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తాడు. ఒకరు వచ్చేసి తమ మనిషిని టెర్రరిస్ట్ మర్డర్ చేసిందని చెబుతాడు. మరో వ్యక్తి తన స్నేహితుడిని వ్యాంపైర్ చంపేసిందని చెబుతాడు. ఇక ఎమ్మెల్యే, అతని కొడుకు మర్డర్ కూడా జరుగుతుంది. ఇవన్నీ చేసింది ఎవరు? కార్తీక్ అక్క ఎవరు? ఏం చేసేది? సియ ఎవరు? రతిక ఎవరు? అసలు పూర్వజ్ సైంటిస్ట్‌గానూ.. ఎంక్వైరీ ఆఫీసర్ గానూ కనిపించారంటే ఆయన డ్యుయెల్ రోల్ పోషించారా? వంటి విషయాలన్నీ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

ఎలా ఉందంటే…

సైన్స్ ఫిక్షన్ సినిమాలు అడపా దడపా వస్తూనే ఉన్నాయి కానీ వాటికి సక్సెస్ రేటు చాలా తక్కువ. మరి ఈ కోవలోనే కిల్లర్ వచ్చింది కానీ ఈ సినిమాను అర్థం చేసుకోవాలంటే మినిమం డిగ్రీ చదివి ఉండాలి. కనీసం క్యారెక్టర్ల పేర్లు కూడా కొన్ని తెలియవు. సినిమా ప్రారంభమంతా వరుస మర్డర్స్.. వంటి వాటితో దర్శకుడు నడిపించారు. సెకండాఫ్‌లో ట్విస్ట్ చెబితే కోటి రూపాయలన్నారు. అసలు దర్శకుడు ట్విస్ట్ ఉందా? లేదా? చెప్పాలంటే బాగుండేదేమో. క్లాస్ పీపుల్‌కే ఈ సినిమా అర్థం కావడం కష్టం. మాస్‌కి అయితే పెద్ద పరీక్షే. ఫస్ట్ హాఫ్ అర్థం చేసుకుని అసలు కథేంటో చెప్పిన వారికి కోటి రూపాయలు ఇస్తామంటే బాగుండేది. ఇక సెకండాఫ్‌లో దర్శకుడు చిక్కు ముడులన్నీ విప్పుకుంటూ వెళ్లాడు కానీ ఏమాత్రం మనకు కనెక్ట్ కావు. అసలు డెత్ బెడ్‌పై ఉన్న మనిషిని సైంటిస్ట్ దగ్గరకు తీసుకెళ్లడమేంటి? ఆయన టెక్నాలజీని ఉపయోగించి ఆమెను బతికించడమేంటి? చదువుకున్న వారికి ఏమాత్రం ఇది అర్థం కాదు. ఇక చదువుకోని వారి పరిస్థితి దారుణమనే చెప్పాలి. మొత్తంగా ఇది సాధారణ వ్యక్తులు చూసి అర్థం చేసుకునే సినిమా అయితే కాదు.

ఎవరెలా చేశారంటే…

జ్యోతి పూర్వజ్ తన పాత్రలో బాగానే నటించారు. దర్శకుడు పూర్వజ్ సైంటిస్ట్‌గా చాలా బాగా నటించారు. కార్తిక్‌గా చందు కూడా బాగానే నటించాడు. మిగిలిన పాత్రదారులంతా తమ పాత్ర పరిధి మేరకు నటించారు.

టెక్నికల్ పరంగా..

దర్శకుడు పూర్వజ్ అన్ని వర్గాల ప్రేక్షకులనూ దృష్టిలో పెట్టుకుని సినిమా తీసి ఉంటే బాగుండేది. కానీ ఈ సినిమాను ఎవరికీ అర్థం కాకుండా తీశారు. కేవలం సినిమా రెండు గంటలే అయినా కూడా ఫస్ట్ హాఫ్ సాగదీతలా అనిపిస్తుంది. మ్యూజిక్ పరంగా చూస్తే సినిమాలో పాటలేమీ లేవు కానీ బీజీఎం పర్వాలేదనిపించింది. ఇక నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.

ఫైనల్‌గా..

‘కిల్లర్’ చూసేవారికి పెద్ద పనిష్మెంట్

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

Share
Published by
Srinivas

Recent Posts

కల్ట్

అక్టోబర్ 30, 2026

నా వైఫ్ మిస్సింగ్

అక్టోబర్ 25, 2026

418

అక్టోబర్ 23, 2026

హైకూ

అక్టోబర్ 23, 2026

గరివిడి లక్ష్మి

అక్టోబర్ 17, 2026