అగధ

Published by
Srinivas

ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అగధ’. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన కామాక్షి భాస్కర్లను ఓ నిర్మాత ‘అరుంధతి’ చిత్రంలో అనుష్కతో పోల్చడం ఒక ఎత్తైతే.. విడుదలైన అప్‌డేట్స్‌కు వచ్చిన రెస్పాన్స్ మరో ఎత్తు. అన్నీ కలిసి సినిమాపై అంచనాలను ఓ రేంజ్‌కు తీసుకెళ్లాయి. మరి ఆ అంచనాలను సినిమా అందుకుందా? తెలుసుకుందాం.

కథేంటంటే..

మహాదేవి (కామాక్షి భాస్కర్ల) అమ్మ అంశతో జన్మించిన అమ్మాయి. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోతుంది. తనకంటూ ఉన్నది తన బాబాయి (భానుచందర్) మాత్రమే. అనుకోకుండా ఓ రోజు ఓ దైవ శ‌క్తి క‌నిపించడంతో ఆమె కొత్త మార్గాన్ని ఎంచుకుంటుంది. బాబాయికి ఇద్దరు కూతుళ్లు జన్మించాక పిన్ని చనిపోతుంది. ఆ తరువాత మరొక ఆమె (వనిత)ను పెళ్లి చేసుకుంటాడు. అక్క‌డికి హిమాలయాల నుంచి ఓ సాధువు వ‌చ్చి కొన్ని యంత్ర‌, తంత్ర విద్య‌ల్ని మహాదేవి నేర్పిస్తాడు. వాటిని ప్ర‌జ‌ల మంచి కోసం ఉప‌యోగించాల‌ని సాధువు చెబుతాడు. అప్ప‌ట్నుంచి ప్ర‌జ‌ల్ని అతీత శక్తుల నుంచి కాపాడటమే ధ్యేయంగా పెట్టుకుంటుంది. ఏమైందో ఏమో కానీ సడెన్‌గా మహాదేవి బాబాయి కుటుంబంలోని ఒక్కొక్కరూ మరణిస్తూ ఉంటారు. బాబాయి కూతురు మహిమ (ఉల్కా గుప్తా) చనిపోయిందన్న విషయాన్ని తెలుసుకున్న మహాదేవి ఆ ఊరికి వెళుతుంది. అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవడానికి యత్నిస్తుంది. ఈ క్రమంలోనే మహాదేవికి అగధ గురించి తెలుస్తుంది. అయితే అగధ ఎవరు? అసలు మహిమ చనిపోవడానికి ముందు ఏం జరిగింది? అగధ ఎవరనేది మహాదేవి తెలుసుకోగలిగిందా? అగధను మహాదేవి ఎలా ఎదుర్కొంది? చివరకు అగధను ఏం చేసింది? వంటి విషయాలన్నీ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

సినిమా ఎలా ఉందంటే..

ఫస్ట్ హాఫ్ వరకూ చాలా ఆసక్తికరంగా కొనసాగుతుంది. అసలు బాబాయి కుటుంబంలో ఏం జరుగుతోందో మహాదేవి తెలుసుకోవడం అంతా ఆసక్తికరంగా సాగుతుంది. ఈ క్రమంలోనే మహిమ ఆమె భర్త సింహా (శ్రవణ్ రెడ్డి), అతని స్నేహితుడు బబ్లూ (రాఘవ) అడవిలోకి వెళ్లడం.. అక్కడ జరిగిన పరిణామాలు అన్నీ ఆసక్తిరంగా అనిపిస్తాయి. ఇక సెకండాఫ్ విషయానికి వస్తే అగధ ఎవరనేది తెలుసుకోవడం.. ఆపై అగధను మహాదేవి ఏం చేసిందన్న అంశాలతో రూపొందించారు. ఫస్ట్ హాఫ్ ఇంట్రస్టింగ్‌గానే తీసుకెళ్లారు కానీ సెకండాఫ్‌ను ఆసక్తికరంగా మలచలేకపోయారు. సినిమా మొత్తం ఎలా ఉన్నా కూడా కొన్ని సినిమాలను క్లైమాక్స్ నిలబెడుతుంది. కానీ ఈ చిత్రానికి అతి పెద్ద మైనస్ క్లైమాక్సే అనిపించింది. సింపుల్‌గా తేల్చేసినట్టుగా అనిపించింది. అలా కాకుండా సెకండాఫ్ స్ట్రాంగ్ ఉండి ఉంటే సినిమా వేరే లెవల్లో ఉండేది. మొత్తానికి అగధ ఫస్ట్ హాఫ్ ఓకే కానీ సెకండాఫ్ మాత్రం దెబ్బేసింది. సెకండాఫ్ స్ట్రాంగ్‌గా ఉండి ఉంటే మాత్రం సినిమా మంచి సక్సెస్ సాధించి ఉండేది.

ఎవరెలా నటించారంటే..

మహాదేవిగా కామాక్షి భాస్కర్ల తన పాత్రలో జీవించింది. చాలా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇక శ్రవణ్ రెడ్డి పాత్ర విషయానికి వస్తే రెండు వేరియేషన్స్ ఉంటాయి. కానీ రెండింటిలోనూ అంత అద్భుత నటన అయితే తను ఇవ్వలేదు. భానుచందర్ అద్భుతంగా నటించారు కానీ ఏమాత్రం ప్రాధాన్యత లేని పాత్ర. ఉల్కా గుప్తాకు మంచి పాత్రే దక్కింది. ఆమె నటన కూడా బాగుంది. వనిత తదితరులు తమ పాత్ర పరిధి మేరకు నటించారు.

టెక్నికల్ పరంగా..

సినిమా సక్సెస్ అనేది ఎక్కువగా దర్శకుడిపైనే ఆధారపడి ఉంటుంది. ఈ సినిమాను ఎంఎస్ రాజు బాగానే ప్రారంభించారు కానీ ముగింపే సింపుల్‌గా ఇచ్చారు. ఫస్ట్ హాఫ్‌ను తీర్చిదిద్దినంత పవర్‌ఫుల్‌గా సెకండాఫ్‌ను తీర్చిదిద్దలేకపోయారు. మ్యూజిక్ పరంగా సినిమా ఓ మెట్టు ఎక్కింది. బీజీఎం చాలా బాగుంది. ఎడిటింగ్ కూడా పర్వాలేదనిపించింది. నిర్మాణ విలువలు సినిమాకు తగినట్టుగానే ఉన్నాయి.

ఫైనల్‌గా.. ‘అగధ’ కొంత వరకు మెప్పిస్తుంది.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

Share
Published by
Srinivas

Recent Posts

ది తాజ్ స్టోరీ

ఆగస్ట్ 13, 2026

GDN (GD నాయుడు)

ఆగస్ట్ 8, 2026

డిసి

ఆగస్ట్ 7, 2026

KJQ

ఆగస్ట్ 7, 2026

కొరియన్ కనకరాజు

ఆగస్ట్ 7, 2026