మాయ లేడీ

Published by
Srinivas

Maya Lady Review Telugu: బాహుబలితో నటుడిగా, ఎవ్వరికీ చెప్పొద్దు & జితేందర్ రెడ్డితో హీరోగా విజయాలు అందుకున్నారు రాకేష్ వర్రే. ఆయన హీరోగా నటించిన తాజా సినిమా మాయ లేడీ.

బాహుబలితో నటుడిగా… ఎవ్వరికీ చెప్పొద్దు & జితేందర్ రెడ్డితో హీరోగా విజయాలు అందుకున్నారు రాకేష్ వర్రే. ఆయన హీరోగా నటించిన తాజా సినిమా మాయ లేడీ. ఇందులో మధుమిత సర్కార్ హీరోయిన్. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించిన ఈ సినిమాలో సత్య, ఇంద్రజ, సురేష్ కీలక పాత్రలు చేశారు. ప్రశంకర్ దర్శకత్వంలో రాకేష్ వర్రే నిర్మించారు. ఈ సినిమా ఎలా ఉంది?

కథ (Maya Lady Movie Story):

క్రిష్ (రాకేష్ వర్రే) ఓ సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ నిర్వహిస్తున్నాడు. అమ్మాయిలలో ధైర్యం నింపడమే తన లక్ష్యమని చెబుతాడు. ఓ అమ్మాయిని వేధించిన కేసులో కోర్టుకు సాక్ష్యం అందజేసిన ఆశ (మధుమిత సర్కార్)ని చూసి ప్రేమలో పడతాడు. ఆమెకు దగ్గరయ్యే క్రమంలో రూప (మధుమిత సర్కార్)కు కూడా దగ్గరవుతాడు.

ఆశ, రూప వేర్వేరు అని తెలిశాక క్రిష్ ఏం చేశాడు? అసలు వాళ్ళిద్దరూ ట్విన్ సిస్టర్సా? లేదంటే వేర్వేరు వ్యక్తులా? ఆ ఇద్దరిలో క్రిష్ ప్రేమించింది ఎవర్ని? అసలు నిజం ఏమిటి? అనేది సినిమా.

విశ్లేషణ (Maya Lady Analysis):

ఎవ్వరికీ చెప్పొద్దులో కుల మతాల పట్టింపులు (కాస్ట్ డిఫరెన్స్) గురించి సున్నితంగా డిస్కస్ చేశారు. జితేందర్ రెడ్డి ఓ బయోపిక్. ఓ హీరోగా, నిర్మాతగా తన అభిరుచి చాటుకున్నారు రాకేష్ వర్రే. అతని రెండు సినిమాల గురించి తెలిసిన ప్రేక్షకులకు… మాయ లేడీలో కంటెంట్ ఉంటుందని ఓ ఆశ కలిగింది.

మాయ లేడీ ఇంటర్వెల్ సమయానికి ఇందులో ఉన్నది కొత్త కంటెంట్ కాదని, విక్రమ్ అపరిచితుడు కాన్సెప్ట్ తీసుకుని చేసిన సినిమా అని క్లారిటీ వస్తుంది. స్ప్లిట్ పర్సనాలిటీ కాన్సెప్ట్ మీద తెలుగులో వచ్చిన సినిమాలు తక్కువ. పైగా, అపరిచితుడు తర్వాత ఆ సాహసం ఎవరూ చేయలేదు. ఆ సినిమా వచ్చి చాలా రోజులు అయ్యిందని, ఫిమేల్ సెంట్రిక్ స్ప్లిట్ పర్సనాలిటీ సినిమాగా మాయ లేడీని తీశారు. ఇది రెండు గంటల సినిమా అయినప్పటికీ… నాలుగు గంటలు చూసిన ఫీలింగ్ కలుగుతుంది. అంత నిదానంగా, చాలా నెమ్మదిగా సాగింది.

కథకు కీలకమైనది హీరోయిన్ క్యారెక్టర్. స్ప్లిట్ పర్సనాలిటీ రోల్ చేయడం అంత ఈజీ కాదు. యాక్టింగ్ పరంగా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వగల ఆర్టిస్ట్ చాలా అంటే చాలా అవసరం. ఆ పాత్రకు పది శాతం కూడా న్యాయం చేయలేదు మధుమిత సర్కార్. ఆశ, రూప పాత్రలకు ఆమె అసలు సెట్ కాలేదు. ఆర్టిస్ట్ సెలక్షన్ విషయంలో మాత్రమే కాదు… సన్నివేశాలు రాసుకోవడంలోనూ దర్శకుడు ప్రశంకర్ తన ట్యాలెంట్ చూపించిన సన్నివేశాలను వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. ఏ నమ్మకంతో రాకేష్ వర్రే ఈ కథను ఓకే చేశారనేది అర్థం కాదు. సెల్ఫ్ డిఫెన్స్ నుంచి మొదలు పెడితే లవ్ స్టోరీ, స్ప్లిట్ పర్సనాలిటీ వరకు ఏదీ ఆకట్టుకునేలా తీయలేదు. టెక్నికల్ అంశాల పరంగా… విశాల్ చంద్రశేఖర్ సంగీతం ఒక్కటే పర్వాలేదు. ప్రొడక్షన్ విషయంలో కాంప్రమైజ్ అయ్యారు. కెమెరా వర్క్ జస్ట్ ఓకే. ఎడిటింగ్ విషయంలో కేర్ తీసుకోవాల్సింది. డైలాగ్స్ ఎగ్జెయిర్ చేయలేదు.

రాకేష్ వర్రే నటన ఓకే. క్రిష్ పాత్రకు తగ్గట్టు చేశారు. ఆయన వరకు న్యాయం చేశారు. మధుమిత సర్కార్ బదులు మరొక హీరోయిన్ అయితే బాగుండేది. సినిమా అంతటా రాకేష్ వర్రేతో పాటు స్నేహితుడిగా సత్య కనిపించారు. అయితే నవ్వించిన సీన్లు తక్కువ. సీనియర్ నటుడు సురేష్, ఇంద్రజ తదితరులు ఉన్నా సరైన సీన్లు పడకపోతే వాళ్లు మాత్రం ఏం చేస్తారు?

Maya Lady Final Verdict:

మాయ లేడీ బదులు ఈ సినిమాకు అపరిచితురాలు అని టైటిల్ పెడితే కరెక్టుగా ఉండేది. అంతే కాదు… క్యాస్టింగ్ ఎంత ఇంపార్టెంట్ అనేది చెప్పే చిత్రమిది. ఈ సినిమాకు రాకేష్ వర్రే కంటే హీరోయిన్ మధుమిత సర్కార్ చేసిన డ్యామేజ్ ఎక్కువ. అంతకు మించి రైటింగ్ పరంగా మినిమమ్ ఎఫర్ట్ కూడా పెట్టని దర్శకుడు చేసిన డ్యామేజ్ ఎక్కువ. రెండు మూడు సీన్లు నవ్వించాయి. రెండు పాటలు బావున్నాయంతే. స్ప్లిట్ పర్సనాలిటీకి ఫిమేల్ సెల్ఫ్ డిఫెన్స్, కాన్ఫిడెన్స్ వంటి కాన్సెప్ట్స్ యాడ్ చేశారు. సినిమా మాత్రం ఎంగేజ్ చేయలేదు, ఎంటర్టైన్ చేయలేదు.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

Share
Published by
Srinivas

Recent Posts

చంద్రయాన్

నవంబర్ 13, 2026

దొంగ నా కొడుకు

నవంబర్ 13, 2026

ఇట్లు అర్జున

నవంబర్ 13, 2026

సీన్

నవంబర్ 6, 2026

సమ్మర్ హాలిడేస్

నవంబర్ 6, 2026

రామాయణ: పార్ట్ 1

నవంబర్ 5, 2026