మిరాయ్

Published by
Srinivas

Mirai Review: విజువల్ గ్రాండియర్ 

తేజ సజ్జ హీరోగా నటించిన సినిమా ‘మిరాయ్’. మంచు మనోజ్ విలన్. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. సమీక్షలో సినిమా గురించి తెలుసుకోండి.

‘హనుమాన్’తో పాన్ ఇండియా విజయం సాధించారు తేజ సజ్జ. ఆ సినిమా తర్వాత మరోసారి మైథాలజీ, సూపర్ పవర్స్ కాన్సెప్ట్ తీసుకుని ‘మిరాయ్’ చేశారు. మంచు మనోజ్ విలన్‌గా, శ్రియ శరణ్ హీరో తల్లిగా నటించారు. జగపతి బాబు, జయరామ్ కీలక పాత్రలు చేశారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెరకెక్కించింది. టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మాతలు. సమీక్షలో సినిమా గురించి తెలుసుకోండి. 

కథ:

వేద (తేజ సజ్జ) హైదరాబాద్ యువకుడు. సెకండ్ హ్యాండ్ మాల్ చేయడం అతని పని. ప్రతి దానికిని డూప్లికేట్ తయారు చేస్తాడు. అతడిని వెతుకుతూ హిమాలయాల నుంచి విభ (రితికా నాయక్) వస్తుంది. ప్రపంచానికి ఏర్పడబోయే పెను ప్రమాదాన్ని ఎదుర్కొవాలని చెబుతుంది.

అమరత్వానికి సంబంధించిన రహస్యాలను తొమ్మిది గ్రంథాల్లో అశోక చక్రవర్తి భద్రపరుస్తాడు. కొన్ని తరాల తర్వాత తొమ్మిదో గ్రంథానికి అంబిక (శ్రియ) రక్షణగా ఉంటుంది. ఆ గ్రంథాలను సొంతం చేసుకుని అమరత్వం సాధించాలని బ్లాక్ స్వార్డ్ (మంచు మనోజ్) చేసే ప్రయత్నాలను వేద ఎలా అడ్డుకున్నాడు? వేద గతం ఏమిటి? శ్రీరాముని నుంచి ఎటువంటి సాయం అందింది? మిరాయ్ ఏమిటి? వంటి ప్రశ్నలకు సమాధానం సినిమా చూసి తెలుసుకోవాలి. 

విశ్లేషణ:

‘మిరాయ్’ మొదలైనప్పటి నుంచి ముగింపు వరకు ప్రతి సీన్ ఒక విజువల్ గ్రాండియర్. భారీ సినిమాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో ఉంటుంది. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ‘మిరాయ్’ ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకు వెళ్లడంలో నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యారు. మైథాలజీ నేపథ్యంలో తీసిన సినిమా అయినా సరే స్టయిలిష్‌గా ప్రజెంట్ చేశారు. హరి గౌర మ్యూజిక్, కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ, యాక్షన్ కొరియోగ్రఫీ, వీఎఫ్ఎక్స్ ప్రతిదీ పర్ఫెక్ట్‌గా కుదిరిరాయి.

రెగ్యులర్ సినిమాల టైపులో హీరో హీరోయిన్ల మధ్య టిపికల్ లవ్ ట్రాక్ లేదు. కానీ తేజ సజ్జ ఇంట్రడక్షన్ ఫైట్ తీశారు. ఫస్టాఫ్ ప్రెడిక్టబుల్‌గా ఉంటుంది. కానీ తన గతం గురించి తేజ సజ్జ తెలుసుకునే సీన్ సూపర్బ్ వచ్చింది. ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ వరకు సంపాతి ఎపిసోడ్ గూస్ బంప్స్ ఇచ్చింది. ఎక్స్‌ట్రాడినరీ వీఎఫ్ఎక్స్ వర్క్ యాడ్ కావడంతో ఇంటర్వెల్ కిక్ ఇస్తుంది. ఆ తర్వాత కథలోకి వెళ్లడంతో కథనంలో వేగం నెమ్మదించింది. కానీ ఆ విజువల్ గ్రాండియర్ మాత్రం మిస్ కాలేదు. కామెడీ కోసం చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి.

హరి గౌర మ్యూజిక్ సినిమాకు ప్రాణం పోసింది. ఆయన ఆర్ఆర్ రీఫ్రెషింగ్‌గా ఉంది. ప్రతి సన్నివేశంలో కొత్తగా వినిపించింది. ముందు చెప్పినట్టు వీఎఫ్ఎక్స్ టాప్ క్లాస్. కెమెరా వర్క్ సూపర్బ్. ప్రొడక్షన్ వేల్యూస్ ఉన్నత స్థాయిలో ఉన్నాయి. అన్నిటి కంటే యాక్షన్ కొరియోగ్రఫీ సినిమాను నెక్స్ట్ లెవల్‌కు తీసుకు వెళ్ళింది. టెక్నికల్ పరంగా సినిమా అవుట్ స్టాండింగ్ అని చెప్పాలి.

తేజ సజ్జ ఫెంటాస్టిక్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. యూత్ సీన్స్ అదరగొట్టారు. యోధగా అంతకు మించి బాగా చేశారు. మంచు మనోజ్ రాకింగ్ పెర్ఫార్మన్స్ సినిమాలో హైలైట్. యాక్టింగ్, స్టైలింగ్, డైలాగ్ డెలివరీ అన్నింట్లో బెస్ట్ ఇచ్చారు. ఆయన నటనకు ఫ్యాన్స్ ఫిదా అవుతారు. అంబికగా ఆ పాత్రలో శ్రియను చూడటం కొత్తగా ఉంటుంది. చక్కటి నటన కనబరిచారు. జగపతి బాబు, జయరామ్, ఇతర సీనియర్ ఆర్టిస్టుల నటనలో అనుభవం కనిపించింది. గెటప్ శ్రీను, కిషోర్ తిరుమల, వెంకటేష్ మహా కాస్త నవ్వించారు. పర్ఫెక్ట్ క్యాస్టింగ్ కుదిరింది. 

తీర్పు:

వెండితెరపై ఓ విజువల్ గ్రాండియర్ మిరాయ్. మైథాలజీ నేపథ్యంలో కొత్త సూపర్ హీరో కథను కార్తీక్ ఘట్టమనేని చెప్పిన తీరు బావుంది. తేజ సజ్జ తన బెస్ట్ ఇచ్చారు. మంచు మనోజ్ తన స్క్రీన్ ప్రజెన్స్‌తో అందరినీ డామినేట్ చేశారు. శ్రీ రాముడు ఎపిసోడ్, ఇంటర్వెల్ ఎపిసోడ్, మిరాయ్ శక్తితో తేజ సజ్జ చేసే యాక్షన్ సీన్ పూనకాలు తెప్పిస్తాయి. ఇంటర్వెల్ ముందు, తర్వాత గూస్ బంప్స్ ఇచ్చే మూమెంట్స్ ఉన్నాయి. సిల్వర్ స్క్రీన్ మీద చూసి ఎంజాయ్ చేయాల్సిన సినిమా ‘మిరాయ్’.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

Share
Published by
Srinivas

Recent Posts

బైకర్

ఏప్రిల్ 3, 2026

రాకాస

ఏప్రిల్ 3, 2026

ఎస్ సరస్వతి

మార్చి 7, 2026

మృత్యుంజయ్

మార్చి 6, 2026