రాజు వెడ్స్‌ రాంబాయి

Published by
Srinivas

రాజు వెడ్స్‌ రాంబాయి రివ్యూ

అఖిల్‌ రాజ్‌, తేజస్వి రావు జంటగా నటించిన చిత్రం రాజు వెడ్స్‌ రాంబాయి. సాయిలు కంభంపాటి దర్శకత్వంలో వేణు ఊడుగుల, రాహుల్‌ మోపిదేవి నిర్మించారు. శివాజీ రాజా, చైతు జొన్నలగడ్డ, అనిత చౌదరి, కవిత శ్రీరంగం తదితరులు కీలక పాత్రలు పోషించారు. వినూత్న ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పించిందో చూద్దాం.

కథ:

వరంగల్‌ – ఖమ్మం మధ్య ఓ పల్లెలో జరిగే కథ ఇది. ఆ ఊళ్లో రాజు (అఖిల్‌ రాజ్‌) బ్యాండ్‌ వాయించడంతో తోపు. పెళ్లైనా, చావు అయినా రాజు బ్యాండ్‌ మోత మోగాల్సిందే. అదే ఊళ్లో ఉండే రాంబాయి (తేజస్విని రావ్‌)ని చిన్నప్పట్నుంచి ఎంతగానో ప్రేమిస్తాడు. తొలుత అతని ప్రేమను తిరస్కరించినా తర్వాత తన ప్రేమలోని నిజాయితీ, బ్యాండ్‌ కొట్టే స్టైల్‌ చూసి ఫిదా అయిపోతుంది. అయితే ఆమె తండ్రి వెంకన్న (చైతన్య జొన్నలగడ్డ)కి అది ష్టం ఉండదు. కూతురికి ప్రభుత్వం ఉద్యోగం ఉన్న కుర్రాడికి ఇవ్వాలనుకుంటాడు. అదే అతని లక్ష్యం. అందుకే రాంబాయిని పెళ్లి చేసుకునేందుకు ఆమెతో కలిసి రాజు ఓ దారి ఎంచుకుంటాడు. మూడు ముళ్లు వేయడానికి ముందే ఆమెని గర్భవతిని చేస్తే వెంకన్న చచ్చినట్లు తమ పెళ్లికి అంగీకరిస్తాడనుకుంటారు ఇద్దరు. వాళ్లు అనుకున్న ప్రయత్నం చేశాక ఏం జరిగింది. వెంకన్న వల్ల్ల రాజు – రాంబాయి? ప్రేమకథలో ఎలాటిఇ మలుపుతు చోటు చేసుకున్నాయి. పెళ్లిని అడ్డుకోవడానికి వెంకన్న ఎలాంటి దుర్మార్గానికి దిగాడు అన్నది మిగతా కథ.

విశ్లేషణ:

అగ్ర వర్ణాల్లోనే కాదు, చిన్నవర్గాల్లోనూ పరువు హత్యలు ఉంటాయని కళ్లకు కట్టినట్లు చూపించే లవ్‌స్టోరీ ఇది. అయితే ఇందులో ప్రేమించిన కుర్రాడినో.. అమ్మాయినో హత్య చేయడమనే కోణం ఇందులో ఉండదు. ‘రాజు వెడ్స్‌ రాంబాయి’ అనే టైటిల్‌కు న్యాయం చేసేలా కథ ముగింపు ఉంటుంది. అయితే ప్రేమ కథలో ఇంతవరకు ఏ ప్రేమికులకు ఎదురుకానీ ఎ దుర్మార్గం ఇందులో ఉంది. అది మనసుల్ని కుదిపేస్తుంది. ఆ ముగింపుపై బలమైన నమ్మకంతోనే దర్శకుడు ఈ చిత్రాన్ని తీసినట్లు తెలుస్తుంది.

ఓ వైపు ప్రేమించిన అబ్బాయికి.. మరో వైపు కనిపెంచిన తండ్రి అతి ప్రేమకు మధ్య ఆ యువతి ఎలా నలిగిపోయింది? అన్నది కట్టిపడేసేలా ఉంది. పెళ్లికి ముందే గర్భవతి అయిన ప్రేమజంట పెళ్లి తంతుని చూపిస్తూ కథని ఆరంభించిన తీరు.. ఆ వేడుకలోనే నాయకానాయికల క్యారెక్టర్స్‌ని పరిచయం చేసిన విధానం ఆకట్టుకుంటుంది. తన ప్రేమను ప్రేయసికి తెలియజేసేందుకు రాజు చేసే ఫీట్లు.. అతని అమాయకత్వం.. నిజాయితీ.. ఓ వైపు నవ్విస్తూనే మరో వైపు మనసుల్ని హత్తుకుంటాయి. హీరో ఫ్రెండ్స్‌ గ్యాంగ్‌ చేసే అల్లరి అలరిస్తుంది.

తన కూతురి ప్రేమకథ గురించి వెంకన్నకు తెలిసినప్పటినుంచి కథలో వేగం పెరుగుతుంది.ఆ తర్వాత వెంకన్న స్పందించిన తీరు.. తదితర అంశాలు ఆసక్తి రేకెత్తిస్తాయి. సెకెండాఫ్‌ కాస్త స్లోగా, ల్యాగ్‌లాగా అనిపిస్తుంది. తన ప్రేమ కారణంగా హీరో తండ్రిని పోగొట్టుకోవడం.. ఆ బాధతో ఊరు వదలి వెళ్లిపోవడం.. ఆ తర్వాత తన ఉద్యోగ ప్రయాణంలో ఎదురైన అవమానాలతో కథ ముందుకెళ్తుంది. వెనక్కి వచ్చాక రాంబాయి తనకెలా దగ్గరైంది? పెళ్లి ప్రయత్నాలు ఎలా సాగాయి దాన్ని అడ్డుకోవడానికి తండ్రి ఎలాంటి దారుణానికి ఒడిగట్టాడ అన్నది కీలకం.

క్లైమాక్స్‌ మాత్రం హృదయాన్ని బరువెక్కిస్తుంది. అయితే దాన్ని ప్రేక్షకులు ఎలా తీసుకుంటారన్నది చూడాలి. గ్రామీణవాసి రాసుగా అఖిల్‌ పర్ఫెక్ట్‌గా సూటయ్యాడు. ఆ క్యారెక్టర్‌లో నిజాయతీ ఉన్నట్లే నటనలోనూ ఉంది. ఎమోషనల్‌ సీన్స్‌లో కట్టిపడేశాడు. రాంబాయిగా తేజస్వినీ నటన.. పలికించిన హావభావాలు ఆకట్టుకున్నాయి. తెలంగాణ యాస కూడా ఆకట్టుకుంది. వెంకన్నగా చైతన్య జొన్నలగడ్డ ఆకట్టుకున్నాడు. హీరో ఫ్రెండ్స్‌ గ్యాంగ్‌లో డాంబర్‌, మోహన్‌ పాత్రలు నవ్విస?్తయి. దర్శకుడు రాసుకున్న కథను నిజయాతీగా తెరపై ఆవిష్కరించాడు. కెమెరా వర్క్‌, సురేశ్‌ బొబ్బిలి సంగీతం, పాటలు సినిమా ప్లస్‌ అయ్యాయి. నిర్మాణ విలువలు బావున్నాయి. క్లైమాక్స్‌ భావోద్వేగ సన్నివేశాలను ప్రేక్షకులు రిసీవ్‌ చేసుకునే విధానాన్ని బట్టి సినిమా రిజల్ట్‌ ఉంటుంది.

తీర్పు:

‘రాజు వెడ్స్ రాంబాయి’ నిజాయతీతో చెప్పిన గ్రామీణ ప్రేమకథ. మొదటి భాగం ఆకట్టుకుంటుంది, నటుల నటన బాగా నెగ్గింది. రెండో భాగంలో ల్యాగ్ ఉన్నప్పటికీ భావోద్వేగభరితమైన క్లైమాక్స్‌ హృదయాన్ని తడిమేలా ఉంటుంది. ప్రేక్షకులు క్లైమాక్స్‌ను ఎలా స్వీకరిస్తారో సినిమాకి అదే కీలకం. మొత్తం మీద సమీపంలోని లోపాలు ఉన్నా చూడదగిన, భావోద్వేగం ప్రధానంగా నడిచే లవ్ స్టోరీ.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

Recent Posts

ఎస్ సరస్వతి

మార్చి 7, 2026

మృత్యుంజయ్

మార్చి 6, 2026

విష్ణు విన్యాసం

ఫిబ్రవరి 27, 2026

కపుల్‌ ఫ్రెండ్లీ

ఫిబ్రవరి 16, 2026