ఆంధ్రా కింగ్ తాలూకా

Published by
Srinivas

ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ రివ్యూ

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా, కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో నటించిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ విజయానంతరం దర్శకుడు మహేష్ బాబు పి రూపొందించిన ఈ చిత్రం విడుదలకు ముందే అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది. ముఖ్యంగా ఇంద‌వ‌ర‌కు ఎవ‌రూ ట‌చ్ చేయ‌ని “అభిమాని – హీరో బంధం”ను ప్రధాన క‌థాంశంగా తీసుకుని తెరకెక్కించిన కథ ఎంతవరకు ప్రేక్షకులను మెప్పించిందో ఇప్పుడే రివ్యూ చ‌దివి తెలుసుకోండి.

కథ:

తొమ్మిది వరుస ఫ్లాపులతో కుంగిపోయిన స్టార్ హీరో సూర్య (ఉపేంద్ర) వందో సినిమా మధ్యలోనే ఆగిపోతుంది. నిర్మాతకు ఆర్థిక ఇబ్బందులు రావడంతో చేతులేత్తేస్తాడు. ఏం చేయాలో తెలియ‌ని ప‌రిస్థితుల్లో ఉన్న‌ సమయంలో హీరో అకౌంట్‌లోకి సాగర్ అనే ఓ అభిమాని నుంచి పెద్ద మొత్తం డిపాజిట్ అవుతుంది. విష‌యం తెలుసుకున్న హీరో అత‌న్ని వెతుక్కుంటూ ప్ర‌యాణం మొద‌లు పెడ‌తాడు. ఈ క్ర‌మంలో త‌న అభిమానికి సంబంధించిన క‌థను తెలుసుకుంటూ ఉంటాడు.

రాజమండ్రి పరిసరాల్లోని గూడిపల్లి లంకకు చెందిన సాగ‌ర్‌, అక్క‌డి గ్రామ‌స్తులు తనిత్య ప‌డ‌వ‌ల్లో ప్ర‌యాణం చేసి స‌మీప గ్రామాల్లోకి వెళ్లి ప‌నులు చేసుకుంటూ జీవ‌నం గ‌డుపుతుంటారు. వారిని అంతా త‌క్కువ‌గా చూస్తుంటారు. అయితే.. చిన్న‌ప్ప‌టి నుంచే సూర్య అనే హీరోకు వీరాభిమానిగా ఉన్న‌ సాగ‌ర్ త‌మ‌ హీరో సినిమా రిలీజ్ అయినా, హీరోని మాట అన్నా ప‌డ‌డు. ఈ నేప‌థ్యంలో తాము నిత్యం సినిమాలు చూసే మహాలక్ష్మి థియేటర్ వ‌ద్ద పెద్ద హంగామానే సృష్టిస్తుంటాడు. ఓ సారి సినిమా రీల్ జాప్యం వల్ల జ‌రిగిన ఇష్యూలో థియేట‌ర్ ఓన‌ర్ పురుషోత్తం (మురళీ శర్మ) సాగ‌ర్‌ను అక్క‌డ‌కు రాకుండా చేస్తాడు. స‌రిగ్గా అదే స‌మ‌యంలో పురుషోత్తం కూతురు, కాలేజీలో తన జూనియర్ అయిన మ‌హాల‌క్ష్మిని (భాగ్యశ్రీ బోర్సే)ని గాఢంగా ప్రేమిస్తాడు.

ఈ విష‌యం తెలుసుకున్న పురుషోత్తం వారి పెళ్లికి అంగీక‌రించక పోగా సాగ‌ర్‌ను, వారి లంక గ్రామాన్ని బాగా త‌క్కువ చేసి మాట్లాడుతాడు. దీంతో సాగ‌ర్ ఆవేశంతో త‌మ లంక‌లోనే హై క్లాస్ థియేట‌ర్ క‌ట్టి మా హీరో వందో సినిమాను రిలీజ్ చేసి తీరుతాన‌ని, మ‌హాల‌క్ష్మిని పెళ్లి చేసుకుంటాన‌ని శ‌ప‌థం చేస్తాడు. కానీ అదే స‌మ‌యంలో వ‌రుస ఫ్లాపుల‌తో కుదేలైపోయిన స్టార్ హీరో వందో చిత్రం ఆగిపోయింద‌ని తెలుస్తుంది. దీంతో సాగ‌ర్ చేసిన‌ సవాలు అత‌ని జీవితాన్ని ఏవిధంగా మార్చింది? సూర్య–సాగర్ బంధం ఎక్కడికి వెళ్లింది? మహాలక్ష్మి ఎందుకు మ‌రొక‌రితో పెళ్లికి సిద్ధ‌మైంది. చివ‌ర‌కు అభిమాని గురించి తెలుసుకున్న‌ హీరో ఏం చేశాడ‌నేదే కథ.

విశ్లేషణ:

దర్శకుడు మహేష్ బాబు అభిమాని ఎమోషన్‌ను చూపాలనే ప్రయత్నం నిజాయితీగా ఉంది. అయితే కథను మరింత బలంగా నడిపించే భావోద్వేగ స‌న్నివేశాలు తగ్గినట్లు అనిపిస్తుంది. రామ్ పోతినేని ఎనర్జటిక్ స్క్రీన్ ప్రెజెన్స్, క్లైమాక్స్ ప‌ది నిమిషాలు, రావు ర‌మేశ్ సీన్లు, అక్క‌డ‌క్క‌డ స‌త్య కామెడీ, లొకేషన్స్, డైలాగులు, భాగ్య శ్రీ అందం ఆక‌ట్టుకుంటాయి. ఇక‌పోతే.. నేరేషన్‌లో స్లోగా ఉండ‌డం, అభిమాని–హీరో మ‌ధ్య బాండింగ్‌కు కావాల్సినంత ఎమోష‌న్ మిస్ అయింది. అలాగే కొన్ని రొటీన్ సీన్స్, ఫ్యామిలీ రియాక్షన్స్ అన్ని సినిమాల్లో చూసిన‌వే మ‌ళ్లీ మ‌ళ్లీ వ‌స్తుంటాయి.

రామ్ పోతినేని సాగర్ పాత్రలో పూర్తిగా ఒదిగిపోయి, సినిమాకు ఎనర్జీని తీపుకొచ్చాడు. ప్రతి సీన్‌లో అతని నటన ఆకట్టుకుంది. ఉపేంద్ర స్క్రీన్ టైమ్ తక్కువగా ఉన్నా తన పాత్రకు న్యాయం చేశారు. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే స్క్రీన్ ప్రెజెన్స్, నటన రెండూ బాగున్నాయి. రావు రమేష్, మురళీ శర్మ, రాహుల్ రామకృష్ణల‌కు మంచి పాత్ర‌లు ప‌డ్డాయి. పాట‌ల‌లో హీరో రామ్ స్వ‌యంగా సాహిత్యం అందించిన‌ ‘నువ్వుంటే చాలే’ పాట మాత్ర‌మే ఆక‌ట్టుకుంటుంది. వివేక్–మెర్విన్ బ్యాగ్రౌండ్ స్కోర్ ప్రెష్‌గా ఉంది. నిర్మాణ విలువలు బావున్నాయి.

తీర్పు:

అంచనాలు పెట్టుకోకుండా సినిమా చూస్తే ఓకే.. పాస్ అనుకుంటూ ప్రేక్షకుడు థియేటర్ బయటకు వస్తాడు.

Read ‘Andhra King Taluka’ Review in English

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

Recent Posts

ఎస్ సరస్వతి

మార్చి 7, 2026

మృత్యుంజయ్

మార్చి 6, 2026

విష్ణు విన్యాసం

ఫిబ్రవరి 27, 2026

కపుల్‌ ఫ్రెండ్లీ

ఫిబ్రవరి 16, 2026