కపుల్‌ ఫ్రెండ్లీ

Published by
Srinivas

కపుల్‌ ఫ్రెండ్లీ మూవీ రివ్యూ

సంతోష్‌ శోభన్‌ హీరోగా నటించిన చిత్రం ుకపుల్‌ ఫ్రెండ్లీ’. అశ్విన్‌ చంద్రశేఖర్‌ దర్శకత్వంలో యు.వి కాన్సెప్ట్స్‌ సంస్థ నిర్మించింది. మాసన వారణాసి కథానాయిక. సినిమా పేరు వెల్లడించినప్పటి నుంచి మంచి క్రేజ్‌ ఏర్పడింది. తాజాగా రిలీజ్‌ చేసిన ట్రైలర్‌తో మరింత బజ్‌ క్రియేట్‌ అయింది. రొమాంటిక్‌ లవ్‌స్టోరీగా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.

కథ:

శివ ఇంటీరియర్‌ డిజైనర్‌. తను కోరుకున్న జాబ్‌ దొరకకపోవడంతో ఖాళీగా తిరుగుతుంటాడు. ఖాళీగా ఉండే కుర్రాళ్ల పరిస్థితి కుటుంబంలో ఎలా ఉంటుందో శివది కూడా అలాంటి పరిస్థితే. తండ్రి తిట్టడంతో కోపంతో ఇల్లు వదిలి నెల్లూరు నుంచి చెన్నై వెళ్లిపోతావు. బతకడానికి బైక్‌ పూలింగ్‌ చేస్తూ ఉద్యోగాలు వెతుకుతుంటాడు. బీటెక్‌ పూర్తి చేసి హాస్టల్‌లో ఉంటూ జాబ్‌ ప్రయత్నాల్లో ఉండే మిత్ర (మాసన వారణాసి) శివకి పరిచయమవుతుంది. పని మీద ఇంటికి వెళ్తూ హాస్టల్‌ ఖాళీ చేయాల్సి వస్తుంది. అనుకోకుండా వెనక్కి తిరిగి రావడంతో హాస్టల్‌లో రూములు ఖాళీ ఉండవు. తప్పనిసరి పరిస్థితుల్లో శివ రూమ్‌లో పెయింగ్‌ గెస్ట్‌గా పెట్టుకుంటాడు. ఆమె వల్ల శివ జీవితం మారిపోతుంది. ఇంటీరియర్‌ డిజైనర్‌గా బిజీ అవుతాడు. ఇద్దరూ ప్రేమలో పడతారు. పెళ్లి అనుకున్న సమయంలో ఓ సమస్య ఎదురవుతుంది. మిత్రకు వచ్చిన సమస్య ఏంటి? తన జీవితం అనుకున్నట్లు ఉందా? శివ, మిత్ర ఒకటయ్యారా లేదా అన్నది కథ.

విశ్లేషణ:

ఉద్యోగం లేకుండా ఖాళీగా తిరిగే కుర్రాడి పరిస్థితి ఎలా ఉంటుందో ఇందులో శివ పరిస్థితి కూడా అదే. కథ మొదలు కూడా అలాగే ఉంటుంది. ఒక బ్రేకప్‌తో మొదలైన కథ ఇంట్లో చివాట్లతో చెన్నైకి షిప్ట్‌ అవుతుంది. అక్కడి ఒకమాఆ్మయితో పరిచయం, ప్రేమ, లివింగ్‌ రిలేషన్‌, ఫిజికల్‌ రిలేషన్‌, ఉద్యోగం, బాధ్యత అన్నింటిని కలగలిపి దర్శకుడు చాలా బ్యాలెన్స్‌గా తెరకెక్కించారు. కథ సీరియస్‌గా సాగినా ఆడియన్స్‌కు కనెక్ట్‌ అయ్యేలా ఉంటుంది. ఫస్టాఫ్‌లో సగమంతా హీరోహీరోయిన్లే బైక్‌ మీద తిరుగుతూనే ఉంటారు. అయినా ఆ సన్నివేశాలు బోర్‌ కొట్టవు. ఇంటర్వెల్‌కి ఇద్దరికీ చిన్న ఇష్యూతో కాస్త దూరంగా ఉండాల్సి వస్తుంది. ఇంటర్వెల్‌. తర్వాత పెళ్లి అంటూ పెద్దల ఎంట్రీ.. ఇద్దరి ప్రేమకథ బయటపడటం.. ఆ కాసేపటికే హీరోయిన్‌ వైపు మరో పెద్ద సమస్య. అదే ికథను మలుపు తిప్పుతుంది. అలాగే ఓ పక్క కథను నడుపుతూనే మరో పక్క కేరళలోనూ సన్నివేశాలను చూపించి ఏదో ట్విస్ట్‌ ఉందని హింట్‌ ఇచ్చాడు. కథపై ఆసక్తి పెంచాడు. ఈ సస్పెన్స్‌లో ఇంటెన్స్‌ కొంచెం పెంచితే బావుండేది. క్లైమాక్స్‌ ట్విస్ట్‌తో ప్రేక్షకులను బరువెక్కించాడు దర్శకుడు. క్లైమాక్స్‌ను చాలా మెచూర్డ్‌గా తెరకెక్కించాడు. హీరోహీరోయిన్లు ఒకే ఇంట్లో ఉండటం ప్రేమలో పడటం, జీవితం కోసం పోరాటం చేయడంలాంటి కథలు టాలీవుడ్‌లో చాలానే వచ్చాయి. అయితే ఇక్కడ ఇద్దరిలో ఒకరికి కష్టం వచ్చినప్పుడు ఇద్దరూ ఎలా ముందుకెళ్లారు అన్నది దర్శకుడు హృద్యంగా చూపించాడు.

నటీనటుల పనితీరు:

సంతోష్‌ శోభన్‌ శివ పాత్రకకు పక్కాగా సూటయ్యాడు. కూ్యూట్‌ లవ్‌స్టోరీ కావడంతో ఇందులో డాన్స్‌లకు, యాక్షన్‌కు అసలు స్కోప్‌ లేదు. పాత్రకు తగ్గట్టు ఎమోషన్స్‌ను చక్కగా క్యారీ చేశాడు. మిత్ర పాత్రకు మానస వారణాసి సరైన ఎంపిక. క్యూట్‌గా, చక్కని ఎక్స్‌ప్రెషన్స్‌తో అలరించింది. ఆమెకిది బరువైన పాత్ర. ఎక్కడా డ్రాప్‌ చేయలేదు. తొలి సినిమాతో కంపేర్‌ చేస్తే చాలా మెచూర్డ్‌గా నటించింది. హీరోహీరోయిన్ల పాత్రల రీత్యా వారి మధ్య సన్నివేశాలను ఇంకాస్త డ్రమటైజ్‌ చేసుంటే బావుండేది. గోపరాజు రమణ,రాజీవ్‌ కనకాల పాత్రలకు న్యాయం చేశారు. యోగిబాబు పాత్ర ఫర్వాలేదనిపించింది. సినిమాటోగ్రఫీ మేజర్‌ ఎసెట్‌. దినేష్‌ పురుషోత్తమన్‌ కలర్‌ఫుల్‌గా తెరకెక్కించారు. ఆదిత్య రవీంద్రన్‌ నేపథ్య సంగీతం బావుంది. సంభాషణలు బావున్నాయి. లవ్‌స్టోరీ కాబట్టి మంచి మెలోడీస్‌ పడి ఉంటే సినిమాకు ప్లస్‌ అయ్యేది. ఎడిటింగ్‌ క్రిస్ప్‌గా ఉంది. యు.వి సంస్థకు నిర్మాణ విలువలు బావున్నాయి.

తీర్పు:

దర్శకుడు అశ్విన్‌ చంద్రశేఖర్‌ చేసిన జెన్యూన్‌ అటెంప్ట్‌ ఇది. అంచనాలు పెట్టుకోకుండా సినిమాకు వెళ్లే మంచి లవ్‌స్టోరీ చూశామనే భావనతో థియేటర్‌ నుంచి బయటకు వస్తారు.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

Share
Published by
Srinivas

Recent Posts