సుందరకాండ

Published by
Srinivas

సుందరకాండ రివ్యూ: ప్రేమకు, వయసుకు మధ్య నలిగిన యువకుడి మనసు… నవ్వులు మనకు!

విక్టరీ వెంకటేష్ హీరోగా రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ‘సుందరకాండ’ హిట్. ఆ టైటిల్‌తో నారా రోహిత్ సినిమా చేశాడు. ఈ సినిమా ఎలా ఉంది? అనేది సమీక్ష చదివి తెలుసుకోండి.

నారా రోహిత్ ఆశించిన కమ్ బ్యాక్ ‘ప్రతినిధి 2’, మల్టీస్టారర్ ‘భైరవం’ ఇవ్వలేదు. కానీ ‘సుందరకాండ’ ప్రచార చిత్రాలు ప్రామిసింగ్‌గా కనిపించాయి. గతంలో విజయాలు అందించిన డిఫరెంట్ కాన్సెప్ట్ ఫిలిమ్ మీద నారా రోహిత్ నమ్మకం పెట్టుకున్నట్టు అనిపించింది. టీజర్, ట్రైలర్, సాంగ్స్ పాజిటివ్ వైబ్ తెచ్చాయి. హిట్ కళతో గణేష్ చతుర్థి పండగకు థియేటర్లలో విడుదలయ్యింది సినిమా. ప్రేక్షకులను సినిమా ఆకట్టుకునేలా ఉందా? విక్టరీ వెంకటేష్ ‘సుందరకాండ’కు సంబంధం ఉందా? అనేది సమీక్షలో చూద్దాం!     

కథ:

పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలో ఐదు క్వాలిటీలు ఉండాలని సిద్ధార్థ్ (నారా రోహిత్) పట్టుబట్టడంతో జుట్టుకు రంగేసుకునే వయసు వచ్చినా ఒంటరిగా మిగులుతాడు. తండ్రి (నరేష్ విజయకృష్ణ), అక్క (వాసుకి) కన్వీన్స్ చేయడానికి ట్రై చేసినా ఐదు క్వాలిటీలు లేకపోతే పెళ్ళికి ససేమిరా అంటాడు. పెళ్ళి మీద ఆశలు వదులుకుని అమెరికాకు పయనమైన సమయంలో తనకంటే వయసులో చిన్నదైన ఐరా (విర్తి వఘాని)తో ప్రేమలో పడతాడు. 

సిద్ధార్థ్‌ను ఐరా ప్రేమిస్తుంది. పెళ్ళికి లైన్ క్లియర్ అనుకుంటున్న తరుణంలో సిద్ధార్థ్ సీనియర్, స్కూల్‌లో ప్రేమించిన వైష్ణవి (శ్రీదేవి విజయ్ కుమార్) కనిపిస్తుంది. అప్పుడు సిద్ధార్థ్ ఏం చేశాడు? అతడి పెళ్ళికి ఎటువంటి సమస్యలు వచ్చాయి? వంటి ప్రశ్నలకు సమాధానం థియేటర్లలో సినిమా చూసి తెలుసుకోవాలి. 

విశ్లేషణ:

‘సుందరకాండ’లో వెంకటేష్ లెక్చరర్. హీరోని స్టూడెంట్ లవ్ చేస్తుంది. ఈ ‘సుందరకాండ’లో లవ్ కోసం లెక్చరర్ అవతారం ఎత్తుతాడు హీరో. అతడు వెళ్ళిన కాలేజీలో హీరోయిన్ స్టూడెంట్. అమ్మాయి కోసం ఆ కాలేజీకి వెళ్తాడు. అంతకు మించి స్టోరీల్లో సిమిలారిటీస్ లేవు.

వెంకటేష్ ‘సుందరకాండ’ టైటిల్‌తో నారా రోహిత్ కూడా ఆ టైపులో ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేశాడు. కాకపోతే స్టోరీ, స్క్రీన్ ప్లే, ఎమోషన్స్ కంటే సిచ్యువేషనల్ ఫన్ మీద ఎక్కువ డిపెండ్ అయిన సినిమా. మూవీలో మేజర్ ట్విస్ట్ ఒక్కటే. అది రివీల్ చేస్తే ఫస్ట్ టైమ్ సినిమా చూసే ఆడియన్‌కు కిక్ ఉండదు. ట్విస్ట్ తెలిసిన ఆడియన్‌ సైతం ఎంజాయ్ చేసే కామెడీతో కొత్త డైరెక్టర్ వెంకటేష్ నిమ్మలపూడి సినిమా తీశాడు.

కాన్సెప్ట్ బేస్డ్ ఎంటర్టైనర్ ‘సుందరకాండ’. లవ్ స్టోరీలో మెయిన్ విలన్ ఏజ్ గ్యాప్ కాదు, మరొకటి. అది సినిమాలో చూస్తే కిక్కు. రిలేషన్షిప్స్ అనేవి ఎమోషన్స్, స్క్రీన్ ప్లేలో మేజర్ రోల్ ప్లే చేశాయి. అటు ఇటు అయితే మొదటికి మోసం వచ్చే ప్రమాదం ఉంది. డైరెక్టర్ వెంకటేష్ నిమ్మలపూడి సిన్సిబుల్‌గా డీల్ చేయడంతో ఎబ్బెట్టుగా అనిపించలేదు. కామెడీ కోసం ట్విస్ట్ తీసుకోలేదు. లవ్, రిలేషన్షిప్ పరంగా స్టార్ట్ టు ఎండ్ ప్రతి పాయింట్ జస్టిఫై చేశాడు. రైటింగ్‌లో కామెడీతో పాటు ఫిలాసఫీ అక్కడక్కడా చెప్పాడు. అక్కడ కూడా కామెడీ డామినేట్ చేసింది. సో కొన్ని సీన్స్ లెంగ్త్ ఎక్కువైనా కంప్లైంట్స్ లేకుండా ముందు వెళ్లాయి. సాంగ్స్ సాఫీగా సాగాయి. విజువల్స్ ఓకే. నిర్మాతలు కాంప్రమైజ్ కాకుండా సినిమా తీశారు. 

కామెడీ లేదా ఎమోషన్స్ స్క్రీన్ మీద వర్కవుట్ అవ్వడానికి 50 పర్సెంట్ రైటింగ్ రీజన్ అయితే మిగతా 50 పర్సెంట్ ఆర్టిస్ట్స్ పెట్టిన ఎఫర్ట్స్. నారా రోహిత్, సత్య కాంబినేషన్ సీన్స్‌లో ఇద్దరి టైమింగ్ భలే కుదిరింది. అయితే హీరో రోల్స్ కోసం రోహిత్ వెయిట్ తగ్గాల్సిన అవసరం ఉంది. సీనియర్ నరేష్, అభినవ్, వాసుకి ఆనంద్, విర్తి వఘాని, సునయన ప్రతి ఒక్కరూ సన్నివేశాలకు న్యాయం చేశారు. ఓవర్ ది బోర్డు వెళ్ళకుండా రోహిత్, శ్రీదేవి విజయ్ కుమార్, విర్తి వఘాని సెటిల్డ్ పెర్ఫార్మన్స్ ఇవ్వడం వల్ల ఎమోషనల్ సీన్స్ వర్కవుట్ అయ్యాయి. శ్రీదేవి అందం ఏమాత్రం తగ్గలేదు. విర్తి ప్రామిసింగ్ హీరోయిన్ మెటీరియల్. సత్య భుజాల మీద కామెడీ నడిచింది. అతడికి క్లాప్స్ కొట్టొచ్చు. 

తీర్పు:

కాన్సెప్ట్ బేస్డ్ క్లీన్ ఫ్యామిలీ ఫిలిమ్ ‘సుందరకాండ’. ప్రేమకు, వయసుకు మధ్య నలిగిన యువకుడి మనసు మనకు నవ్వులు ఇస్తుంది. కాన్సెప్ట్ డీల్ చేసిన తీరుకు మెచ్చుకోవచ్చు. నారా రోహిత్, శ్రీదేవి పెర్ఫార్మన్స్‌కు తోడు సత్య కామెడీ టైమింగ్ ఆడియన్స్‌కు పైసా వసూల్ ఫిలిమ్ అందించాయి.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

Share
Published by
Srinivas

Recent Posts

సిగ్మా

అక్టోబర్ 2, 2026

తెల్ల కాగితం

అక్టోబర్ 2, 2026

డోరతీ

అక్టోబర్ 2, 2026

అనుమాన పక్షి

సెప్టెంబర్ 25, 2026

ది ప్యారడైజ్

సెప్టెంబర్ 24, 2026