ఆంధ్ర ప్రదేశ్

ఏపీకి మరో ప్రాజెక్ట్.. భారీగా ఉద్యోగ అవకాశాలు

Published by
Rahul N

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధి, ఆధునిక మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఏపీఎం టెర్మినల్స్ (APM Terminals) సంస్థతో ఏపీ మారిటైమ్ బోర్డు అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.

ఈ ఒప్పందం ప్రకారం రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టుల్లో ఆధునిక సదుపాయాల అభివృద్ధి, పోర్టుల సమగ్ర నిర్వహణను ఏపీఎం టెర్మినల్స్ చేపట్టనుంది. అదనంగా, ఓడరేవుల్లో ఆధునిక టెర్మినల్స్, కార్గో హ్యాండ్లింగ్ వ్యవస్థలు కూడా ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించబడింది.

మొత్తం రూ. 9 వేల కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్టులు అమలు కాబోతున్నాయి. వీటి ద్వారా సుమారు 10,000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

రాష్ట్ర రాజకీయ వర్గాలు ఈ ఒప్పందాన్ని ఏపీ పోర్టుల అభివృద్ధి కొత్త దశలోకి అడుగుపెట్టిన ఘట్టంగా విశ్లేషిస్తున్నాయి.

Rahul N