ఆంధ్ర ప్రదేశ్

చంద్రబాబు విజన్.. మరో గొప్ప పథకం

Published by
Srinivas

ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. విదేశాలకు వెళ్లి ఉన్నత విద్య అభ్యసించాలనుకునే స్టూడెంట్స్ కు ఆర్థిక సహాయం అందించే పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది.

ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ, కాపు వర్గాల్లోని పేద విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం ఏర్పడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పథకాన్ని మళ్లీ ప్రారంభించనున్నారు. ఈ పథకం అమలుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద రాష్ట్రంలో అర్హత కలిగిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.25 లక్షలు అందిస్తారు.

అదే బీసీ, మైనారిటీలకు రూ.20 లక్షలు.. ఈబీసీ, కాపు విద్యార్థులకు రూ.15 లక్షలు ఇవ్వాలని ప్రతిపాదించారు. మరో రూ.5 లక్షలు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అదనంగా నిర్వహణ ఖర్చుల కోసం ఇవ్వాలని సూచించారు. పీజీ, పీహెచ్డీ, ఎంబీబీఎస్ కోర్సులకు ఈ అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం వర్తిస్తుంది.

గతంలో టీడీపీ ప్రభుత్వం 2014-2019 మధ్య అంబేద్కర్, ఎన్టీఆర్ పేర్లతో ఈ విదేశీ విద్యకు సంబంధించిన పథకాన్ని అమలు చేసింది. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేరు మార్చడంతో పాటు, చాలా రూల్స్ కూడా పెట్టింది. దీంతో ఈ పథకం ఆశయం నీరుగారిపోయింది. తాజాగా కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని పునరుద్ధరించింది.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

Recent Posts