అన్నమయ్య జిల్లాలో యువతిపై యాసిడ్ దాడికి పాల్పడిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి ఘటనను సీరియస్ గా తీసుకున్న ముఖ్యమంత్రి, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసుల్ని ఆదేశించారు.
బాధిత యువతికి మెరుగైన వైద్యం అందించాలంటూ అధికారుల్ని ఆదేశించిన సీఎం.. యువతి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. చంద్రబాబు ఆదేశాల మేరకు ఇప్పటికే ప్రభుత్వానికి చెందిన పలువురు అధికారులు, మంత్రులు హాస్పిటల్ కు వెళ్లారు. హోం మంత్రి స్వయంగా ఈ కేసును దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
గుర్రంకొండ మండలం ప్యారంపల్లెకు చెందిన గౌతమి అనే యువతిని, మదనపల్లి అమ్మచెరువు మిట్టకు చెందిన గణేశ్ కొన్ని రోజులుగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఇటీవల యువతికి పెళ్లి కుదిరింది. ఏప్రిల్ 29న పెళ్లి చేయాలని నిశ్చయించారు.
తనకు దక్కని అమ్మాయి వేరే ఎవ్వరికీ దక్కకూడదనే కోపంతో యువతిపై, గణేశ్ కక్ష పెంచుకున్నాడు. ఆమెపై పాశవికంగా దాడి చేశాడు. తలపై కత్తితో పొడిచాడు. తర్వాత నోట్లో యాసిడ్ పోశాడు. ఘటన జరిగిన నిమిషాల వ్యవథిలోనే నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువతి పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగా ఉంది.