Download App

పోసాని కృష్ణమురళి అరెస్ట్

ఫిబ్రవరి 27, 2025 • By Srinivas
నటుడు, దర్శకుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయ్యారు. జగన్ హయాంలో, ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ హోదాలో చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ పై గతంలో తీవ్ర విమర్శలు చేశారు పోసాని.దీనికి సంబంధించి ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. చిత్ర పరిశ్రమలో విబేధాలు...

పోసాని కృష్ణమురళి అరెస్ట్

నటుడు, దర్శకుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయ్యారు. జగన్ హయాంలో, ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ హోదాలో చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ పై గతంలో తీవ్ర విమర్శలు చేశారు పోసాని.

దీనికి సంబంధించి ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. చిత్ర పరిశ్రమలో విబేధాలు సృష్టించేలా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ తాజాగా 2 రోజుల కిందట అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ లో మరో కేసు నమోదైంది.

ఈ కేసు కింద పోసానిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోసాని అరెస్ట్ కోసం ప్రత్యేక బృందం హైదరాబాద్ వెళ్లింది. అంతా శివరాత్రి వేడుకల్లో ఉంటుండగా, హైదరాబాద్ లోని మై హోం భుజ అపార్ట్ మెంట్ లో పోసానిని అదుపులోకి తీసుకుంది. అంతకంటే ముందు హైదరాబాద్ పోలీసులకు సమాచారం కూడా ఇచ్చింది. ఇలా అంతా ప్రోటోకాల్ ప్రకారం పూర్తిచేశారు పోలీసులు.

పోసాని కృష్ణమురళి అరెస్ట్

కొన్ని రోజుల కిందట ఇదే అపార్ట్ మెంట్ నుంచి మరో వైసీపీ నేత వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి విజయవాడ తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. పోసాని కూడా ఇందులోనే ఉంటున్నారనే విషయం ఇప్పుడు చాలామందికి తెలిసొచ్చింది.

అరెస్ట్ సందర్భంగా పోలీసులతో వాగ్వాదానికి దిగారు పోసాని. తను చికిత్స చేయించుకుంటున్నానని, అరెస్ట్ చేయడం అనైతికమని వాదించే ప్రయత్నం చేశారు. పోలీసులు మాత్రం స్పాట్ లోనే నోటీసులిచ్చి పోసానిని తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

View all posts

మరిన్ని వార్తలు

No categories found.

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading