ఇంటర్వ్యూలు

‘బైకర్’ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది – మాళవిక నాయర్

Published by
Srinivas

చార్మింగ్ స్టార్ Sharwanand నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ స్పోర్ట్స్ డ్రామా బైకర్పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. Malavika Nair హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో Rajasekhar పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో, UV Creations నిర్మిస్తున్న ఈ సినిమా భారతదేశపు మొట్టమొదటి పూర్తి స్థాయి మోటోక్రాస్ డ్రామాగా రూపొందుతోంది. ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మాళవిక నాయర్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

హై అడ్రినలిన్ జర్నీ

2024 ఏప్రిల్‌లో కథ విన్నప్పుడే చాలా ఎక్సైట్ అయ్యానని మాళవిక చెప్పారు. “ఇది ఇండియాలో ఫస్ట్ మోటోక్రాస్ ఫిల్మ్. హై అడ్రినలిన్, హై ఆక్టేన్ అనుభూతి ఇస్తుంది. మ్యూజిక్ కూడా అద్భుతంగా ఉంటుంది” అని తెలిపారు.

కథలో కీలకమైన పాత్ర

తన పాత్ర గురించి ఎక్కువగా చెప్పకూడదని చెబుతూ, “నా క్యారెక్టర్ కథకు బ్రిడ్జ్‌లా ఉంటుంది. స్పోర్ట్స్‌మన్ జీవితంలో ఫ్యామిలీ ఎంత ముఖ్యమో ఇందులో చూపించాం. మూడు టైమ్‌లైన్స్‌లో కథ సాగుతుంది, అందులో నా పాత్ర కూడా ఇవాల్వ్ అవుతుంది” అని వివరించారు.

శర్వానంద్‌తో కెమిస్ట్రీ

శర్వానంద్‌తో పని చేసిన అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ, “మేమిద్దరం రియల్ లైఫ్‌లో ఇంట్రోవర్ట్స్ అయినా, సినిమాలో మంచి కెమిస్ట్రీ వచ్చింది. ఆయన చాలా స్పాంటేనియస్ యాక్టర్” అని అన్నారు.

మోటోక్రాస్ ఛాలెంజ్

ఈ చిత్రాన్ని F1తో పోల్చడం గురించి మాట్లాడుతూ, “మోటోక్రాస్ షూట్ చేయడం చాలా కష్టం. కానీ టెక్నికల్‌గా, మ్యూజిక్ పరంగా మంచి హై ఇస్తుంది. ఫ్యామిలీ ఎమోషన్స్, ముఖ్యంగా ఫాదర్-సన్ ట్రాక్ చాలా స్పెషల్” అని చెప్పారు.

మ్యూజిక్ & డ్యాన్స్ హైలైట్స్

“ప్రెట్టీ బేబీ” అనే పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందంగా ఉంటుందని తెలిపారు. అలాగే సంగీత దర్శకుడు Ghibran అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రతి క్యారెక్టర్‌కు ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొస్తుందని అన్నారు.

రాజశేఖర్‌తో అనుభవం

రాజశేఖర్‌తో నటించడం గొప్ప అనుభవమని చెబుతూ, “ఆయన చాలా సీనియర్ అయినప్పటికీ సెట్లో అందరితో ఫ్రెండ్లీగా ఉంటారు. చాలా కైండ్ పర్సన్” అని ప్రశంసించారు.

డైరెక్టర్‌పై అభిప్రాయం

దర్శకుడు అభిలాష్ రెడ్డి గురించి మాట్లాడుతూ, “ఆయనకు కథ, క్యారెక్టర్స్‌పై క్లియర్ విజన్ ఉంది. షూటింగ్‌ను ప్లాన్ ప్రకారం పూర్తిచేస్తారు. మంచి లీడర్” అని చెప్పారు.

సెలెక్టివ్‌గా సినిమాలు ఎందుకు?

తాను డిఫరెంట్ లేయర్స్ ఉన్న పాత్రలకే ప్రాధాన్యత ఇస్తానని, ఆడియన్స్‌తో కనెక్ట్ అయ్యే కథలను మాత్రమే ఎంచుకుంటానని మాళవిక వెల్లడించారు.

ఒక పదంలో “బైకర్”

“థ్రిల్లింగ్” అని చెప్పిన మాళవిక, ఈ సినిమా యంగ్ ఆడియన్స్‌తో పాటు ఫ్యామిలీ ప్రేక్షకులను కూడా ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుందని నమ్మకం వ్యక్తం చేశారు.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.