సినిమా వార్తలు

మళ్లీ సెట్స్‌పై బాలకృష్ణ.. మైసూర్‌లో ‘దాదా’ షూటింగ్ షురూ

Published by
Srinivas

నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘దాదా’పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే ‘ఎంట్రీ ఆఫ్ యాన్ ఎరా’ గ్లింప్స్‌కు వచ్చిన అద్భుతమైన స్పందన, ఆ తర్వాత విడుదలైన టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియో సినిమాపై మరింత హైప్‌ను పెంచాయి. ఈ సినిమాలో బాలకృష్ణను రగ్గడ్, స్టైలిష్, పవర్‌ఫుల్ మాస్ అవతార్‌లో చూపిస్తున్నారు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో కీలక అప్‌డేట్ వచ్చింది. ‘దాదా’ షూటింగ్ మైసూర్‌లో తిరిగి ప్రారంభమైంది. ఇటీవల గాయపడిన బాలకృష్ణ పూర్తిగా కోలుకుని మళ్లీ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. దీంతో చిత్ర బృందంలో కొత్త ఉత్సాహం నెలకొంది.

ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్‌లో ప్రధానంగా టాకీ పార్ట్‌కు సంబంధించిన కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. బాలకృష్ణతో పాటు పలువురు ప్రముఖ నటీనటులు ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు. సినిమాకు అత్యంత కీలకమైన సన్నివేశాలను ఈ షెడ్యూల్‌లో పూర్తి చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

‘దాదా’ బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈసారి మరింత స్టైలిష్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ‘దాదా’ను గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్‌లో బాలకృష్ణను ‘ది కింగ్ ఆఫ్ ఖయాస్’గా పరిచయం చేయడం అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచింది. సినిమాలో మంచు మనోజ్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ చిత్రానికి అర్వింద్ ఎస్. కశ్యప్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తుండగా, ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తుండగా, రామ్-లక్ష్మణ్, రవి వర్మ, వెంకట్ యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు.

వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. క్రిస్మస్ కానుకగా విడుదల కానున్న ‘దాదా’పై బాలయ్య అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.