Download App

అల్లు అర్జున్ చుట్టూ 42 నియమాలా? వైరల్ పాడ్‌కాస్ట్ వ్యాఖ్యలతో నెట్టింట చర్చ

ఫిబ్రవరి 10, 2026 • By Srinivas
స్టార్ హీరో Allu Arjun మరోసారి సోషల్ మీడియా చర్చకు కేంద్రంగా మారారు. ముఖ్యంగా Pushpa ఫ్రాంచైజ్ ఘనవిజయం తర్వాత ఆయన పాన్-ఇండియా స్టార్‌గా విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఓ వైరల్ పాడ్‌కాస్ట్ క్లిప్ కారణంగా ఆయన పేరు వార్తల్లో నిలిచింది. ఈ క్లిప్ Sweekriti Talks...
అల్లు అర్జున్ చుట్టూ 42 నియమాలా? వైరల్ పాడ్‌కాస్ట్ వ్యాఖ్యలతో నెట్టింట చర్చ

స్టార్ హీరో Allu Arjun మరోసారి సోషల్ మీడియా చర్చకు కేంద్రంగా మారారు. ముఖ్యంగా Pushpa ఫ్రాంచైజ్ ఘనవిజయం తర్వాత ఆయన పాన్-ఇండియా స్టార్‌గా విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఓ వైరల్ పాడ్‌కాస్ట్ క్లిప్ కారణంగా ఆయన పేరు వార్తల్లో నిలిచింది.

ఈ క్లిప్ Sweekriti Talks అనే పాడ్‌కాస్ట్ నుంచి వెలుగులోకి వచ్చింది. ఇందులో బ్రాండ్ స్ట్రాటజిస్ట్ Kaveri Baruah తన వృత్తి అనుభవాన్ని పంచుకుంటూ అల్లు అర్జున్‌తో జరిగిన ఓ ప్రొఫెషనల్ మీటింగ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో ఆమె Royal Enfield సంస్థలో బ్రాండ్ స్ట్రాటజీ విభాగంలో పనిచేశారు.

పాడ్‌కాస్ట్‌లో కావేరి మాట్లాడుతూ, అల్లు అర్జున్‌ను కలవడానికి ముందు తమ టీమ్‌కు 42 ‘డూ’s అండ్ డోంట్’s ఉన్న ఓ నోట్ ఇచ్చారన్నారు. ఆ నియమాలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టంగా చెప్పినట్టు తెలిపారు. అంతేకాదు, ఈ నియమాలు అమలవుతున్నాయో లేదో చూసేందుకు ‘మేనేజర్‌కి మేనేజర్‌కి మేనేజర్’ అన్నట్లుగా అనేక స్థాయిల్లో మేనేజ్‌మెంట్ ఉందని ఆమె వ్యాఖ్యానించారు.

ఆ నిబంధనల్లో ముఖ్యంగా “అల్లు అర్జున్ కళ్లలోకి నేరుగా చూడకూడదు”, “చేయి కలపకూడదు” వంటి సూచనలు ఉన్నాయని ఆమె చెప్పడం వైరల్‌గా మారింది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీశాయి.

ఈ నియమాలు ఎందుకు ఉన్నాయన్న ప్రశ్నకు కావేరి స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోయారు. తనకు కారణం తెలియదని, కేవలం అవి తప్పనిసరి ప్రోటోకాల్స్ అని మాత్రమే చెప్పారని వెల్లడించారు. అలాగే మిగతా నియమాల వివరాలను బయటపెట్టేందుకు ఆమె నిరాకరించడంతో ఆసక్తి మరింత పెరిగింది.

ఈ క్లిప్ వైరల్ అయిన తర్వాత నెటిజన్ల భిన్నంగా స్పందింస్తున్నారు. కొందరు ఈ వ్యాఖ్యల ఆధారంగా అల్లు అర్జున్‌ను విమర్శించగా, మరికొందరు వాటిని అతిశయోక్తిగా కొట్టిపారేశారు. అల్లు అర్జున్‌ను వ్యక్తిగతంగా కలిసిన అనుభవాలను పంచుకున్న కొంతమంది అభిమానులు, ఆయన చాలా స్నేహపూర్వకంగా ఉంటారని, తమకు ఎలాంటి ఇబ్బందికరమైన నియమాలు ఎదురుకాలేదని పేర్కొన్నారు.

ప్రస్తుతం ఈ వ్యవహారంపై అల్లు అర్జున్ గానీ, ఆయన టీమ్ గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అందువల్ల ఈ నియమాల నిజానిజాలు ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

View all posts

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading