Download App

సెప్టెంబర్ 12న రాబోతున్న బెల్లంకొండ శ్రీనివాస్ ‘కిష్కిందపురి’ థ్రిల్లర్

ఆగస్ట్ 9, 2025 By Rahul N
హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, హారర్-మిస్టరీ జానర్‌లో తెరకెక్కుతున్న కిష్కిందపురి సినిమాలో బోల్డ్, ఇంటెన్స్ పాత్రలో కనిపించబోతున్నారు. కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం హారర్, మిస్టరీ, ఎమోషనల్ ఎలిమెంట్స్...
సెప్టెంబర్ 12న రాబోతున్న బెల్లంకొండ శ్రీనివాస్ ‘కిష్కిందపురి’ థ్రిల్లర్

హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, హారర్-మిస్టరీ జానర్‌లో తెరకెక్కుతున్న కిష్కిందపురి సినిమాలో బోల్డ్, ఇంటెన్స్ పాత్రలో కనిపించబోతున్నారు. కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం హారర్, మిస్టరీ, ఎమోషనల్ ఎలిమెంట్స్ మేళవింపుతో ఈ సీజన్‌లో అత్యంత ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న సినిమాలలో ఒకటిగా నిలిచింది.

రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్‌తో పాటు మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇంటెన్స్ లుక్‌లో బెల్లంకొండ శ్రీనివాస్, ముందు విరిగిపోతూ ఎగిరిపోతున్న వింటేజ్ రేడియో, బ్యాక్‌డ్రాప్‌లో భయానక మాన్షన్, మంటల్లో కాలి పోతున్న వాన్ విజువల్స్ థ్రిల్లింగ్ ఫీల్‌ని కలిగించాయి.

ఫస్ట్ గ్లింప్స్‌లోనే ప్రేక్షకులు సినిమా సస్పెన్స్‌ ప్రిమైజ్‌ని ఫీల్‌ అయ్యారు. తాజాగా రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్‌ “ఉండిపోవే నాతోనే” మాత్రం పూర్తిగా వేరే మూడ్‌ సెట్ చేసింది. కథలో టెన్షన్‌తో పాటు ఒక రొమాంటిక్‌ షేడ్ ని ప్రజెంట్ చేసింది.

డైరెక్టర్‌ కౌశిక్ పెగళ్లపాటి, కిష్కిందపురి డార్క్, మిస్టీరియస్‌ వరల్డ్‌ను చూపిస్తూ, దానికి కాంట్రాస్ట్‌గా ఎమోషనల్ మూమెంట్స్‌ని చక్కగా మిక్స్‌ చేశారు. కథ ముందుకు సాగే కొద్దీ థ్రిల్ల్స్‌తో పాటు ఎమోషన్స్‌ కలిసిన లేయర్డ్‌ ఎక్స్పీరియెన్స్‌ ఇవ్వబోతోంది.

సినిమా కోసం టాలెంటెడ్‌ టెక్నికల్ టీం పని చేస్తోంది. సామ్‌ సి.ఎస్ మ్యూజిక్, చిన్మయ్ సలస్కర్ డీవోపీ, ప్రొడక్షన్ డిజైన్ మనిషా ఎ. దత్, ఆర్ట్ డైరెక్షన్ డి.శివ కమెష్, ఎడిటింగ్‌ నిరంజన్ దేవరమనే చేశారు. క్రియేటివ్ హెడ్‌గా జి. కనిష్క, కో-రైటర్‌గా దరహాస్ పళకొళ్ళు, స్క్రిప్ట్ అసోసియేట్‌గా కె. బాల గణేష్‌ ఉన్నారు.

సెప్టెంబర్‌ 12కి రిలీజ్ డేట్ ఫిక్స్ కావడంతో మేకర్స్ మరింత దూకుడుగా ప్రమోషన్స్‌ చేయబోతున్నారు.

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading