పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన “భీమ్లా నాయక్” చిత్రం ద్వారా ఆయన పేరు తెలుగు ప్రజలకు సుపరిచితమైంది. ఆయనే” కిన్నెర ” వాద్య కళాకారుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత “దర్శనం మొగిలయ్య”.
2022లో భారత ప్రభుత్వం ఆయన్ని పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఏ కిన్నెర కు అయినా 7 నుండి 9 మెట్లు ఉంటాయి. కానీ ఈయన కిన్నెర వాద్యం లో 12మెట్లు ఉంటాయి. 12 మెట్ల కిన్నెరలో అద్భుత నైపుణ్యం ఉన్న చివరి కళాకారుడు. ఎందుకంటే ఎవరు అది నేర్చుకోవాలి అనే తపన ఎక్కడా కాన రావడం లేదు అని ఆయన ఒక మీడియా ఇంటర్వ్యూలో చెప్పారు.
అంత గొప్ప కళాకారుడు మన తెలుగు వాడైనందుకు గర్వపడాలి. ఆయన అందరి నుండి ఏమి ఆశించడం లేదు…. ప్రేమ, గౌరవం తప్ప… అటువంటి వ్యక్తి పెయింటింగ్ పై కొందరు రాజకీయ సమావేశాల, సినిమా వేడుకల ప్రచార పోస్టర్లు నేరుగా ఆయన పెయింటింగ్ మీదే నే నేరుగా అతికించారు.
అది చూసిన మొగిలయ్య బాధాతప్త హృదయంతో , స్వయంగా వెళ్లి ఆ పోస్టర్లను తీసివేస్తూ పిల్లర్‌ను శుభ్రం చేసుకున్నారు.
ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన పెయింటింగ్ మీద పోస్టర్లు అంటించడం బాధ్యతలేని తనం గా సోషల్ మీడియాలో మండిపడుతున్నారు.
తెలంగాణ జానపద కళలను దేశవ్యాప్తంగా ప్రచారం చేసి, ఆ సంప్రదాయాన్ని కాపాడిన కళాకారుడికి ఇదా మనమిచ్చే మర్యాద అని అడుగుతున్నారు. ఈ వీడియో డిసెంబర్ 17, 2025 ఉదయం సోషల్ మీడియాలో పెట్టారు.
ఇంకొంత మంది నెటిజన్లు ఎవరైతే ఆ పోస్టర్ లను ముద్రించారో….. అందంగా ఉండాల్సిన సిటీని ఇలా అందవిహీనంగా పోస్టర్ లు అంటించి పాడు చేస్తున్నందుకు… వాళ్లపై కేసులు పెట్టాలి అంటున్నారు.
మొగిలయ్య తెలుగు ప్రజలు యొక్క ఆస్తి…. ఆయన మనసు ఎంత బాధపడితే… అలా తన పెయింటింగ్ ను శుభ్రం చేసుకుని తన నిరసన తెలిపి ఉంటాడు. అని ఇంకొందరి నెటిజన్ల వాదన.
ఆ పోస్టర్ ముద్రణ కు కారకులు మీద కేసు పెడితే కొంతలో కొంతైనా మార్పు రావచ్చు భయంతో….