సినిమా వార్తలు

ప్రశాంత్ వర్మ మూవీ ‘మహాకాళి’గా భూమి శెట్టి

Published by
Srinivas

‘హనుమాన్’తో భారతీయ సూపర్ హీరో జానర్‌కు కొత్త దిశ చూపించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ… ఆర్‌కేడీ స్టూడియోస్‌తో కలిసి ఆయన రూపొందిస్తున్న ‘మహాకాళి’ చిత్రంలోని ప్రధాన పాత్రను తాజాగా పరిచయం చేశారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా భూమి శెట్టిని పరిచయం చేస్తూ విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సినీ ప్రపంచంలో హడావుడి రేపింది.

భూమి శెట్టి లుక్‌లో కనిపించిన దివ్యమైన క్షోభ, ఆథ్యాత్మిక కాంతి, శక్తివంతమైన ఆకృతి ప్రేక్షకుల మనసును ఆకట్టుకుంటుంది. ఎరుపు, బంగారు రంగుల మేళవింపుతో, సంప్రదాయ ఆభరణాలు, పవిత్ర చిహ్నాలతో భూమి రూపం కాళిదేవి యొక్క క్రోధం, కరుణ, వినాశనం, పునర్జన్మల ద్వంద్వ స్వరూపాన్ని ప్రతిబింబిస్తుంది.

ఇప్పటికే ఈ చిత్రం 50% షూటింగ్ పూర్తిచేసుకుంది. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా నిర్మించిన భారీ సెట్లో ప్రస్తుతం షూటింగ్ కొనసాగుతోంది. స్టార్ కాస్ట్ లేకపోయినా, భారీ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించడమే కాకుండా, కొత్త ముఖానికి ఇంత పెద్ద అవకాశం ఇవ్వడం సినీ పరిశ్రమలో అరుదైన విషయం. సమాచారం ప్రకారం, అనేక మంది ప్రముఖ నటి‌లు ఈ పాత్ర చేయాలని ఆసక్తి చూపించినా, దర్శకుడు ప్రశాంత్ వర్మ తన విజన్‌కి కట్టుబడి, కథకు తగ్గ సత్యమైన రూపాన్ని చూపగలిగిన నటి‌గా భూమిని ఎంపిక చేశారు.

“From the Universe of HanuMan” అనే ట్యాగ్‌లైన్‌తో వచ్చిన ఈ పోస్టర్, ప్రశాంత్ వర్మ సృష్టిస్తున్న PVCU (Prasanth Varma Cinematic Universe)లో మరో ఘనమైన అధ్యాయాన్ని సూచిస్తోంది. ‘హనుమాన్’ తర్వాత ‘మహాకాళి’ ద్వారా ఆయన రూపొందిస్తున్న ఈ మైథాలజికల్ సూపర్ హీరో యూనివర్స్‌కి ఇది తదుపరి కీలక భాగమవుతుంది.

ఆర్‌కే దుగ్గల్ మరియు రివాజ్ రమేశ్ దుగ్గల్ నిర్మాణంలో, పూజా కొల్లూరు దర్శకత్వంలో రూపొందుతున్న ‘మహాకాళి’ చిత్రం, ఆధునిక సినిమాటిక్ ప్రదర్శనతో భారతీయ మిథాలజీకి కొత్త ఆవిష్కరణగా నిలవనుంది.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.