సినిమా వార్తలు

నందు – అవికా గోర్ రొమాంటిక్ థ్రిల్లర్ ‘అగ్లీ స్టోరీ’ రిలీజ్ డేట్!

Published by
Rahul N

యంగ్ హీరో నందు, అందాల భామ అవికా గోర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘అగ్లీ స్టోరీ’. రియా జియా ప్రొడక్షన్స్ పతాకంపై సీహెచ్ సుభాషిణి, కొండా లక్ష్మణ్ నిర్మాణంలో ఈ చిత్రాన్ని ప్రణవ స్వరూప్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ చిత్రానికి శ్రీసాయికుమార్ దారా సినిమాటోగ్రఫీ అందించగా, శ్రవణ్ భరద్వాజ్ మ్యూజిక్ అందించారు. శ్రీకాంత్ పట్నాయక్, మిథున్ సోమ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.

ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్, టీజర్, పాటలు మంచి స్పందన తెచ్చుకున్నాయి. స్టైలిష్ లుక్‌, ఆసక్తికరమైన కథాంశం, నందు–అవికా కెమిస్ట్రీ సినిమాపై అంచనాలను పెంచేశాయి.

చిత్రబృందం తాజా అప్‌డేట్ ప్రకారం, ఈ చిత్రం నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. రొమాంటిక్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఎమోషన్, సస్పెన్స్, లవ్, డ్రామా మేళవింపుతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందిస్తున్నట్లు సమాచారం.

Rahul N