సినిమా వార్తలు

మాట తప్పిన “సింహాలు”

Published by
Rahul N

1993 Nov 15th న శ్రీ కాళ హస్తి మండలం, గుండ్ల పల్లి లో జరిగిన విమాన ప్రమాదం సంఘటన తో తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒక భారీ కుదుపునకు గురైంది.

హేమా హేమీలైన చిరంజీవి, బాల కృష్ణ, విజయ శాంతి, మాలాశ్రీ, అల్లు రామలింగయ్య దంపతులు, కమెడియన్ సుధాకర్, దర్శకులు కోడి రామకృష్ణ, ఎస్ వి కృష్ణారెడ్డి, ఉప్పలపాటి నారాయణరావు, బాపు, నిర్మాతలు K C శేఖర్ బాబు, కాట్రగడ్డ ప్రసాద్, రాశి మూవీస్ నరసింహారావు, ఆంధ్రావాలా గిరి తదితరులు ఉన్నారు.

ఇది ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారా…. “కొదమ సింహం” రీ రిలీజ్ గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. అప్పుడు విమాన ప్రమాదం జరిగినప్పుడు చిరంజీవి, బాలకృష్ణ ఆ ఊరికి ఏమి కావాలి అని అడిగారట…. ఆ ఊరి వాళ్ళు వీళ్ళకి చేసిన సహాయక చర్యల మూలంగా…. ఆ ఊరి గ్రామ దేవతని దర్శించుకుని…. దానికి ఆ ఊరి వాళ్ళు , ఆ గ్రామ అప్పటి సర్పంచ్ దేశీ రెడ్డి మా ఊరికి హాస్పిటల్ కట్టించండి అని కోరగా…. వీరు ఇద్దరూ అలాగే అని మాట ఇచ్చారట… ఇప్పటి వరకు ఆ ఊరి ముఖం కూడా చూడలేదు అని సోషల్ మీడియా లో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు “కొదమ సింహం”….. తొందరలో “బొబ్బిలి సింహం” కూడా రీ రిలీజ్ కు రావచ్చు….

మాట తప్పిన “సింహాలు” అని ట్రోలింగ్ జరుగుతుంది. ఈ” సింహాలు” ఎప్పటికీ నెరవేరుస్తాయో…. తమ మాటను….

కొసమెరుపు: తమ ప్రాణాలు కాపాడారు అని… ఆ విమాన పైలట్ కు, కో పైలట్ కు తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు సన్మానం చేశారు… తదనంతరం ఆ పైలట్ దే తప్పు అని విమానయాన శాఖ తరపున రిపోర్ట్ వచ్చి… ఆయన్ను ఉద్యోగం నుండి తొలగించారు.

Rahul N

Recent Posts

  • సినిమా వార్తలు

హీరోయిన్లతో రూమర్స్… భయపడిన నాగవంశీ?

నవంబర్ 17, 2026