Download App

మెగాస్టార్ ‘కాకా’.. దీపావళికి అదిరిపోయే పోస్టర్ విడుదల!

నవంబర్ 9, 2026 • By Srinivas
మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ బాబీ కొల్లి మరోసారి ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కాకా’. గతంలో వీరి కలయికలో వచ్చిన బ్లాక్‌బస్టర్ ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత రూపొందుతున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. KVN...
మెగాస్టార్ ‘కాకా’.. దీపావళికి అదిరిపోయే పోస్టర్ విడుదల!

మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ బాబీ కొల్లి మరోసారి ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కాకా’. గతంలో వీరి కలయికలో వచ్చిన బ్లాక్‌బస్టర్ ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత రూపొందుతున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

దీపావళి పండుగను పురస్కరించుకుని చిత్రబృందం తాజాగా ఓ పవర్‌ఫుల్ పోస్టర్‌ను విడుదల చేసింది. వర్షంతో తడిసిన వాతావరణంలో పచ్చని పొలాల మధ్య చేతిలో కొడవలి పట్టుకుని చిరంజీవి కనిపిస్తున్న తీరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రగ్డ్ లుక్, ఇంటెన్స్ బాడీ లాంగ్వేజ్‌తో మెగాస్టార్ కనిపించిన ఈ పోస్టర్ సినిమా రా అండ్ రస్టిక్ నేపథ్యాన్ని ప్రతిబింబిస్తోంది. ఆయన ఫియర్స్ అవతార్ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది.

ఈ సందర్భంగా సినిమా విడుదల తేదీని కూడా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ‘కాకా’ చిత్రాన్ని 2027 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయనున్నారు. దీంతో వచ్చే సంక్రాంతి బరిలో ఈ సినిమా ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. చిరంజీవి పుట్టినరోజున విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్‌లో ఆయనను విభిన్నమైన షేడ్స్‌లో పరిచయం చేయడంతో అప్పటినుంచే సినిమాపై ఆసక్తి పెరిగింది.

ఈ చిత్రంలో అనస్వర రాజన్, నివేదా థామస్, బాలీవుడ్ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే అనస్వర రాజన్‌ను ‘హార్ట్ ఆఫ్ కాకా’గా పరిచయం చేస్తూ, ఆమె పాత్ర పేరు ‘అమ్ములు పాప’ అని వెల్లడించారు. అనురాగ్ కశ్యప్ ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.

ఈ భారీ చిత్రానికి ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. ఎస్. తమన్ సంగీతం అందిస్తుండగా, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా, ఆంటోనీ ఎల్. రూబెన్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.

కోన వెంకట్, కె. చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందిస్తుండగా, హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి అదనపు రచయితలుగా పనిచేస్తున్నారు. భాను-నందు సంభాషణలు అందిస్తున్నారు.

చిరంజీవి-బాబీ విజయవంతమైన కాంబినేషన్, మెగాస్టార్ సరికొత్త మాస్ అవతార్, ఆసక్తికరమైన నటీనటుల బృందంతో ‘కాకా’పై అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా విడుదలైన దీపావళి పోస్టర్‌తో పాటు విడుదల తేదీ ప్రకటన సినిమాపై హైప్‌ను మరింత పెంచాయి. 2027 సంక్రాంతికి మెగాస్టార్ ఎలాంటి సందడి చేయనున్నారో చూడాలి.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

View all posts