గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం “పెద్ది” ఫస్ట్ షాట్ విడుదలకు కౌంట్‌డౌన్ మొదలైంది. క్రేజీ డైరెక్టర్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా గ్లిమ్ప్స్ శ్రీ రామనవమి సందర్భంగా ఏప్రిల్ 6న ఉదయం 11:45 గంటలకు విడుదల కానుంది.
ఈ ఫస్ట్ షాట్ కోసం బుచ్చి బాబు సన – ఏ.ఆర్. రెహమాన్ ల కాంబినేషన్‌లో అందమైన ఆడియో-విజువల్ సిద్ధమైంది. మిక్సింగ్ వర్క్ అంతా పూర్తయ్యింది. ఇక ఈ ఆదివారం ప్రేక్షకుల ముందుకు తేవడానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ ఫస్ట్ షాట్ తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న “పెద్ది” టెక్నికల్ పరంగా అద్భుతమైన అంచనాలకు దారితీస్తోంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానూలకు ఫస్ట్ షాట్ చూపించబోతున్నారు డైరెక్టర్ బుచ్చిబాబు సన.
ఈ చిత్రంలో బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే జగపతిబాబు, దివ్యేందు వంటి నటులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
టెక్నికల్ విభాగంలో ఆర్. రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్షన్‌ను అందిస్తున్నారు.
రామ్‌చరణ్ అద్భుతమైన “పెద్ది” ఫస్ట్ షాట్ రూపంలో మిమ్మల్ని మెస్మరైజ్ చేయబోతోందనడంలో సందేహం లేదు.