Download App

ఓటీటీలోనూ దుమ్మురేపుతోన్న ‘దీవాన’.. ఆహాలో 100+ మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ మైలురాయి

ఆగస్ట్ 5, 2026 By Srinivas
యంగ్ టాలెంటెడ్ హీరో హర్షిత్ రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన ఫీల్‌గుడ్ ఎమోషనల్ లవ్ స్టోరీ ‘దీవాన’ థియేటర్లలో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే జోరును ఓటీటీ వేదికపై కూడా కొనసాగిస్తోంది. ఇటీవల ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా (Aha)లో స్ట్రీమింగ్‌కు వచ్చిన ఈ...
‘దీవానా’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి.. ఎక్కడ అంటే?

యంగ్ టాలెంటెడ్ హీరో హర్షిత్ రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన ఫీల్‌గుడ్ ఎమోషనల్ లవ్ స్టోరీ ‘దీవాన’ థియేటర్లలో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే జోరును ఓటీటీ వేదికపై కూడా కొనసాగిస్తోంది. ఇటీవల ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా (Aha)లో స్ట్రీమింగ్‌కు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందుతూ 100+ మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ అనే అరుదైన మైలురాయిని చేరుకుంది.

థియేటర్లలో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా, ఓటీటీలోనూ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సత్తా చాటుతోంది. మంచి కథ, హృదయాన్ని హత్తుకునే ప్రేమకథ, భావోద్వేగ సన్నివేశాలతో రూపొందిన ఈ చిత్రం డిజిటల్ వేదికపై కూడా అదే స్థాయిలో ఆదరణ పొందడం విశేషం. మరోసారి కంటెంట్ బాగుంటే వేదిక ఏదైనా ప్రేక్షకులు ఆదరిస్తారనే విషయాన్ని ‘దీవాన’ నిరూపించింది.

ఓటీటీలోనూ దుమ్మురేపుతోన్న ‘దీవాన’.. ఆహాలో 100+ మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ మైలురాయి

అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్లపై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంతో హీరోయిన్‌గా స్మేహ మణిమేగలై, దర్శకుడిగా శ్రీకాంత్ సంగిశెట్టి తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. థియేటర్లలో ఈ చిత్రాన్ని గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేసింది.

హర్షిత్ రెడ్డి, స్మేహ మణిమేగలై జంట కెమిస్ట్రీ, హృదయాన్ని తాకే ప్రేమకథ, కుటుంబ భావోద్వేగాలు ఈ సినిమాకు ప్రధాన బలాలుగా నిలిచాయి. ప్రస్తుతం ఆహాలో ఈ చిత్రం మంచి వ్యూయర్‌షిప్‌ను నమోదు చేస్తూ విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

View all posts

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading