Download App

విక్టరీ వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం – AK47’ విడుదల వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే!

సెప్టెంబర్ 22, 2026 By Srinivas
విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ ఎంటర్‌టైనర్ ‘ఆదర్శ కుటుంబం – AK47’ విడుదల తేదీ మారింది. ముందుగా ప్రకటించిన తేదీ కంటే వారం ఆలస్యంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ నిర్ణయించారు. తాజా ప్రకటన ప్రకారం 2026...
విక్టరీ వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం – AK47’ విడుదల వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే!

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ ఎంటర్‌టైనర్ ‘ఆదర్శ కుటుంబం – AK47’ విడుదల తేదీ మారింది. ముందుగా ప్రకటించిన తేదీ కంటే వారం ఆలస్యంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ నిర్ణయించారు. తాజా ప్రకటన ప్రకారం 2026 అక్టోబర్ 9న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

ప్రేక్షకులకు మరింత మెరుగైన, సంపూర్ణ వినోదానుభూతిని అందించాలనే ఉద్దేశంతోనే విడుదలను వారం రోజుల పాటు వాయిదా వేసినట్లు చిత్ర బృందం వెల్లడించింది. దీంతో వెంకటేష్ అభిమానులతో పాటు త్రివిక్రమ్ అభిమానుల్లోనూ సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.

టీజర్‌కు భారీ స్పందన

ఇటీవల విడుదలైన ‘ఆదర్శ కుటుంబం – AK47’ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. మధ్యతరగతి కుటుంబ నేపథ్యాన్ని పరిచయం చేస్తూ రూపొందించిన టీజర్‌లో వెంకటేష్ పాత్రలోని హాస్యం, కుటుంబ భావోద్వేగాలతో పాటు యాక్షన్ అంశాలను కూడా చూపించారు. టీజర్‌కు మంచి స్పందన రావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

త్రివిక్రమ్ శ్రీనివాస్ రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వెంకటేష్‌కు జోడీగా శ్రీనిధి శెట్టి నటిస్తున్నారు. నారా రోహిత్, నివేదా పేతురాజ్, రావు రమేష్, సత్య, బ్రహ్మాజీ, వెన్నెల కిశోర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

‘ఆదర్శ కుటుంబం’ రిలీజ్ ప్లాన్ మార్పు..

భారీ నిర్మాణంలో ‘ఆదర్శ కుటుంబం – AK47’

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

కుటుంబ కథాంశం, హాస్యం, భావోద్వేగాలు, యాక్షన్ అంశాలను మేళవించి తెరకెక్కుతున్న ఈ చిత్రంపై వెంకటేష్ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. తాజా మార్పుతో ‘ఆదర్శ కుటుంబం – AK47’ 2026 అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

View all posts

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading