సినిమా వార్తలు

Idly Kottu: ‘ఇడ్లీ కొట్టు’ ట్విట్టర్ రివ్యూ

Published by
Srinivas

హీరో ధనుష్‌ ‘ఇడ్లీ కొట్టు’ తమిళ్ తో పాటు తెలుగులో నేడు రిలీజ్అయ్యింది. ఎప్పుడూ వైవిధ్యమైన కథలతో అద్భుతమైన నటనతో అలరిస్తుంటారు హీరో ధనుష్‌. రాయన్ వంటి వరుస విజయాలతో ముందుకెళ్తున్నఆయన, ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ వంటి యూత్‌ఫుల్ ఫీల్‌గుడ్ చిత్రంతో ప్రేక్షకులను మెప్పించిన తర్వాత, ఇప్పుడు తన డైరెక్షన్ లో నాలుగో సినిమాగా ఇడ్లీ కొట్టుతో వస్తున్నారు. సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

గత సినిమాలకంటే భిన్నంగా, ఇడ్లీ కొట్టు గ్రామీణ వాతావరణంలో సాగే, భావోద్వేగాలు కథ. ట్రైలర్‌ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

147 నిమిషాల పర్ఫెక్ట్ రన్ టైం తో ఈ చిత్రానికి యూ సర్టిఫికేట్ లభించింది. ఇప్పటికే ట్రైలర్‌, ప్రమోషన్లు అద్భుతమైన రెస్పాన్స్‌ అందుకున్నాయి. ధనుష్‌, నిత్యా మీనన్‌ జంట మరోసారి రీయూనియన్‌ అవ్వడం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వీరిద్దరి కెమిస్ట్రీ తిరు చిత్రంలో ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుందని ప్రేక్షకులు అంటున్నారు.

ఇప్పటికే ‘ఇడ్లీ కొట్టు’ వీక్షించిన ప్రేక్షకులు ట్విట్టర్‌లో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.