సినిమా వార్తలు

Mana Shankara Varaprasad Garu: ‘శశిరేఖ’గా మెరిసిన నయనతార ఫస్ట్ లుక్

Published by
Srinivas

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) – హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకరవరప్రసాద్ గారు’ (Mana Shankara Varaprasad Garu)లో లేడీ సూపర్‌స్టార్ నయనతార (Nayanthara) హీరోయిన్‌గా నటిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి, సుష్మిత కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

మేకర్స్ తాజాగా నయనతార ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. శశిరేఖ పాత్రలో నయన్ పసుపు రంగు చీర, ముత్యాల హారం, సంప్రదాయ గాజులతో అద్భుతంగా మెరిసిపోయారు. చేతిలో నలుపు రంగు గొడుగుతో కనిపించిన ఈ లుక్‌లో ప్రత్యేకమైన ఫెస్టివల్ వైబ్ కన్పిస్తూ, పాత్రకు క్లాసిక్ టచ్‌ని తెచ్చింది.

సినిమాలో నయనతార పాత్ర చాలా కీలకమని, చిరంజీవి పాత్రకు బలమైన సపోర్ట్‌గా నిలుస్తుందని సమాచారం. ముఖ్యంగా, సాధారణంగా ప్రమోషన్లకు దూరంగా ఉండే నయనతార ఈసారి మాత్రం మొదటి నుంచే ప్రచార కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నది ఆసక్తికరంగా మారింది. రేపు విజయదశమి సందర్భంగా ఒక ప్రత్యేక సర్‌ప్రైజ్‌ను ప్రకటించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

ఇంతకు ముందే విడుదలైన చిరంజీవి ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఆయనను స్టైలిష్ అవతార్‌లో చూపిస్తూ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది.

ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా, సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, తమ్మిరాజు ఎడిటింగ్, ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్షన్ బాధ్యతలు చేపట్టారు. ఎస్. కృష్ణ, జి. ఆది నారాయణ సహరచయితలుగా, ఎస్. కృష్ణ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.

‘మన శంకరవరప్రసాద్ గారు’ 2026 సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

Recent Posts