
ధర్మ మహేష్ హీరోగా కిరణ్ తిరుమలశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డ్రింకర్ సాయి’. ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం థియేటర్లలో విడుదలై యూత్, మాస్ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది. ఇప్పుడు అదే జోరును ఓటీటీలోనూ కొనసాగిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
ప్రస్తుతం జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ‘డ్రింకర్ సాయి’ ఫ్రీ ఆన్ జీ5 విభాగంలో టాప్-1 ట్రెండింగ్ మూవీగా నిలిచి విశేష ఆదరణ దక్కించుకుంటోంది. ముఖ్యంగా హీరో ధర్మ మహేష్ నటనకు ప్రేక్షకుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రేమ, బాధ, ఆవేశం, ఆత్మగౌరవం, తిరుగుబాటు స్వభావం వంటి విభిన్న భావోద్వేగాలను ఆయన ఎంతో సహజంగా ఆవిష్కరించారని సోషల్ మీడియాలో సినీ అభిమానులు ప్రశంసిస్తున్నారు.

ఒక సాధారణ యువకుడి జీవితంలో చోటుచేసుకునే సంఘటనలు, ప్రేమలో ఎదురయ్యే సవాళ్లు, భావోద్వేగ సంఘర్షణలను ధర్మ మహేష్ ఎంతో నేచురల్‌గా ప్రదర్శించారు. ముఖ్యంగా కొన్ని కీలక సన్నివేశాల్లో ఆయన ఎక్స్‌ప్రెషన్స్, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. సినిమా మొత్తం తన భుజాలపై మోస్తూ పాత్రలో పూర్తిగా లీనమైన తీరు ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచింది.
ఈ చిత్రంలోని నటనకు గుర్తింపుగా ధర్మ మహేష్ ఇటీవల దుబాయ్‌లో జరిగిన గామా అవార్డ్స్‌లో బెస్ట్ డెబ్యూ యాక్టర్ అవార్డును అందుకోవడం విశేషం. దీంతో ఆయనకు యువ ప్రేక్షకుల్లో మరింత గుర్తింపు లభిస్తోంది.
హీరోయిన్ ఐశ్వర్య శర్మ తన అందం, అభినయంతో ఆకట్టుకోగా, ధర్మ మహేష్‌తో ఆమె కెమిస్ట్రీ సినిమాకు మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే రీతూ చౌదరి, పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్, భద్రం, కిర్రాక్ సీత, ఫన్ బకెట్ రాజేష్, రాజ ప్రజ్వల్ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేసి కథను మరింత బలోపేతం చేశారు.

టెక్నికల్ పరంగా కూడా ‘డ్రింకర్ సాయి’ మంచి ప్రశంసలు అందుకుంటోంది. దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి నేటి యువతకు కనెక్ట్ అయ్యే కథను ఎంచుకుని, ప్రేమ, భావోద్వేగాలు, వినోదం మధ్య సమతౌల్యం పాటిస్తూ చిత్రాన్ని ఆకట్టుకునేలా మలిచారు. నిర్మాతలు కూడా ఎక్కడా రాజీ పడకుండా ఉన్నతమైన నిర్మాణ విలువలను అందించారు.
సంగీత దర్శకుడు శ్రీవసంత్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం చిత్రానికి మరో ప్రధాన బలంగా నిలిచాయి. విడుదలైనప్పటి నుంచి పాటలు సంగీత ప్రియులను ఆకట్టుకుంటుండగా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కథలోని భావోద్వేగాలను మరింత ప్రభావవంతంగా ప్రేక్షకులకు చేరవేసింది.
థియేటర్లలో మంచి విజయాన్ని అందుకున్న ‘డ్రింకర్ సాయి’ ఇప్పుడు జీ5లో టాప్-1 ట్రెండింగ్ స్థానాన్ని దక్కించుకోవడం ద్వారా తన విజయయాత్రను కొనసాగిస్తోంది. ముఖ్యంగా ధర్మ మహేష్ నటనకు వస్తున్న స్పందన ఆయన కెరీర్‌లో ఈ చిత్రాన్ని ఒక ప్రత్యేక మైలురాయిగా నిలబెడుతోంది. ఓటీటీ ప్రేక్షకుల నుంచి రోజురోజుకీ పెరుగుతున్న ఆదరణతో ‘డ్రింకర్ సాయి’ మరింత మందికి చేరువవుతోంది.
