Download App

‘రోమాంచకం’కు మహేష్ బాబు ఫస్ట్ రివ్యూ.. మూవీపై సూపర్ స్టార్ ఏమన్నారంటే?

సెప్టెంబర్ 3, 2026 By Srinivas
యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ‘రోమాంచకం’పై సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశంసలు కురిపించారు. సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్‌కుమార్ జంటగా నటించిన ఈ సినిమా పెయిడ్ ప్రీమియర్స్‌తో ప్రేక్షకుల ముందుకు రాగా.. తాజాగా మహేష్ బాబు తన ఫస్ట్ ఇంప్రెషన్‌ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ సినిమాను...
‘రోమాంచకం’కు మహేష్ బాబు ఫస్ట్ రివ్యూ.. మూవీపై సూపర్ స్టార్ ఏమన్నారంటే?

యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ‘రోమాంచకం’పై సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశంసలు కురిపించారు. సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్‌కుమార్ జంటగా నటించిన ఈ సినిమా పెయిడ్ ప్రీమియర్స్‌తో ప్రేక్షకుల ముందుకు రాగా.. తాజాగా మహేష్ బాబు తన ఫస్ట్ ఇంప్రెషన్‌ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

ఈ సినిమాను వేణు గోపాల్ రెడ్డి రచించి దర్శకత్వం వహించారు. సందీప్ రెడ్డి వంగా సమర్పిస్తున్న ఈ చిత్రానికి ప్రణయ్ రెడ్డి వంగా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే సినిమాపై మంచి బజ్ ఉండగా.. మహేష్ బాబు ప్రశంసలు మూవీపై మరింత ఆసక్తిని పెంచాయి.

‘ఎంటర్‌టైనింగ్ అండ్ ప్రామిసింగ్’.. మహేష్ బాబు

‘రోమాంచకం’ తనకు ఎంటర్‌టైనింగ్‌గా, ప్రామిసింగ్‌గా అనిపించిందని మహేష్ బాబు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ కోసం టీమ్ పడిన కష్టం, చూపించిన ప్యాషన్ సినిమాలో స్పష్టంగా కనిపిస్తున్నాయని ప్రశంసించారు.

సందీప్ రెడ్డి వంగా, ప్రణయ్ రెడ్డి వంగా సహా చిత్ర బృందానికి మహేష్ బాబు ఆల్ ది బెస్ట్ చెప్పారు. సినిమా కోసం టీమ్ చూపించిన ప్రేమ, ప్యాషన్, హార్డ్ వర్క్‌కు తగిన ఫలితం దక్కాలని ఆకాంక్షించారు.

మహేష్ బాబు ప్రశంసలపై స్పందించిన సందీప్ రెడ్డి వంగా.. సూపర్ స్టార్‌కు తన కృతజ్ఞతలు తెలిపారు.

ఈరోజే థియేటర్లలోకి..

ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించిన ‘రోమాంచకం’ నేడు థియేటర్లలో విడుదలైంది. వాసుకి వైభవ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

సుమంత్ ప్రభాస్, అనంతికతో పాటు ఉపేంద్ర లిమాయే, వెంకటేష్ కాకుమాను, నరేంద్ర రవి, మణి ఏగుర్ల, సాయి సోహన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

పెయిడ్ ప్రీమియర్స్ తర్వాత పాజిటివ్ టాక్ తెచ్చుకుంటున్న ఈ సినిమాకు ఇప్పుడు మహేష్ బాబు నుంచి వచ్చిన ప్రశంసలు అదనపు బూస్ట్‌గా మారాయి. మరి ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

View all posts

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading