Download App

దుల్కర్-పూజా కెమిస్ట్రీకి ఫిదా అవుతున్న ఫ్యాన్స్.. ‘శ్రీ శ్రీ’ తొలి పాట ‘బొమ్మ బొమ్మ’ విడుదల

జూలై 28, 2026 By Srinivas
పాన్ ఇండియా స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'శ్రీ శ్రీ' నుంచి తొలి పాట 'బొమ్మ బొమ్మ'ను చిత్ర బృందం విడుదల చేసింది. ఇప్పటికే విడుదలైన వర్కింగ్ స్టిల్స్, ఫస్ట్ లుక్ పోస్టర్‌తో ఆసక్తిని పెంచిన ఈ చిత్రం.. ఇప్పుడు మెలోడీయస్ సాంగ్‌తో సంగీత...
దుల్కర్-పూజా కెమిస్ట్రీకి ఫిదా అవుతున్న ఫ్యాన్స్.. 'శ్రీ శ్రీ' తొలి పాట 'బొమ్మ బొమ్మ' విడుదల

పాన్ ఇండియా స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘శ్రీ శ్రీ’ నుంచి తొలి పాట ‘బొమ్మ బొమ్మ’ను చిత్ర బృందం విడుదల చేసింది. ఇప్పటికే విడుదలైన వర్కింగ్ స్టిల్స్, ఫస్ట్ లుక్ పోస్టర్‌తో ఆసక్తిని పెంచిన ఈ చిత్రం.. ఇప్పుడు మెలోడీయస్ సాంగ్‌తో సంగీత ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ పాటలో దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే మధ్య కనిపించిన అందమైన కెమిస్ట్రీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

నూతన దర్శకుడు రవీ నెలకుడిటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై విజయవంతమైన నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌కు ప్రతిష్ఠాత్మకమైన 10వ నిర్మాణం కావడం విశేషం. ఈషాన్ సక్సేనా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రేమ, వినోదం, భావోద్వేగాలతో కూడిన అందమైన రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

దుల్కర్-పూజా కెమిస్ట్రీకి ఫిదా అవుతున్న ఫ్యాన్స్.. 'శ్రీ శ్రీ' తొలి పాట 'బొమ్మ బొమ్మ' విడుదల

‘బొమ్మ బొమ్మ’ పాట రైల్వే స్టేషన్‌లో ప్రారంభమవుతుంది. బెంచ్‌పై కూర్చున్న దుల్కర్ సల్మాన్ పాత్ర.. ప్లాట్‌ఫారంపై అడుగుపెట్టిన పూజా హెగ్డేను చూసిన క్షణంలోనే ఆమె అందానికి ముగ్ధుడవుతాడు. అక్కడి నుంచి వారి ప్రేమ ప్రయాణం అందమైన క్షణాలతో సాగుతుంది. ఇద్దరి మధ్య చిగురించే ప్రేమను, ఆనందభరితమైన క్షణాలను అద్భుతమైన విజువల్స్‌తో దర్శకుడు ఆవిష్కరించారు.

సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ మరోసారి తనదైన శైలిలో మధురమైన మెలోడీని అందించారు. తొలి వినిపింపులోనే మనసుకు హత్తుకునేలా ఉన్న ఈ ట్యూన్ శ్రోతలను ఆకట్టుకునేలా రూపొందింది. అనంత శ్రీరామ్ రాసిన సాహిత్యం ప్రేమలో మునిగిపోయిన యువకుడి మనసును ఎంతో కవితాత్మకంగా ఆవిష్కరిస్తుంది. కపిల్ కపిలన్ తన మధురమైన గాత్రంతో పాటకు మరింత ప్రాణం పోశారు. రామ్ మాస్టర్ కొరియోగ్రఫీ కూడా పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

దుల్కర్-పూజా కెమిస్ట్రీకి ఫిదా అవుతున్న ఫ్యాన్స్.. 'శ్రీ శ్రీ' తొలి పాట 'బొమ్మ బొమ్మ' విడుదల

అయితే ఈ పాటలో ప్రధాన హైలైట్ మాత్రం దుల్కర్ సల్మాన్-పూజా హెగ్డే జోడీ. వీరిద్దరి సహజమైన నటన, స్క్రీన్ ప్రెజెన్స్, రొమాంటిక్ కెమిస్ట్రీ ప్రతి ఫ్రేమ్‌ను మరింత అందంగా మార్చాయి. ప్రకృతి అందాల మధ్య చిత్రీకరించిన ఈ గీతం విజువల్‌గా కూడా ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తోంది. మధురమైన స్వరాలు, ఆకట్టుకునే విజువల్స్, అందమైన ప్రేమకథతో ‘బొమ్మ బొమ్మ’ త్వరలోనే మ్యూజిక్ చార్ట్స్‌లో టాప్ ప్లేస్ దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సాంకేతిక విభాగంలోనూ ‘శ్రీ శ్రీ’ బలమైన బృందంతో రూపొందుతోంది. అనయ్ ఓం గోస్వామి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు.

భారీ స్థాయిలో రూపొందుతున్న ‘శ్రీ శ్రీ’ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు. తొలి పాటతోనే మంచి స్పందన అందుకున్న ఈ చిత్రం విడుదలకు ముందే సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను నెలకొల్పుతోంది.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

View all posts

Trending Now

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading