చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతోమందికి నేత్ర, రక్త దానాల ద్వారా కంటి చూపు, ప్రాణ దానాలు చేసింది ఈ సంస్థ…. మెగాస్టార్ చిరంజీవి దీనిని 1998 సంవత్సరం లో స్థాపించారు… ఆయన పిలుపు మేరకు ఆయన అభిమానులు వేల సంఖ్య లో రక్త దానం చేస్తుంటారు రెండు తెలుగు రాష్ట్రాల్లో….
ఆయన అభిమానులే కాకుండా పవన్ కళ్యాణ్, మిగతా మెగా కాంపౌండ్ కి చెందిన హీరోల అభిమానులు వారి యొక్క జన్మదినోత్సవ వేడుకల్ని ఘనం గా జరిపిస్తూ ఎక్కడికి అక్కడ రక్త దానాలు చేస్తూ…. ఎంతో మందికి ప్రాణ దాతలుగా నిలుస్తున్నారు.
ఇప్పటివరకు చిరంజీవి చారిటబుల్ సంస్థ కు ఆయన సొంత నిధులతో పాటు, కొంతమంది అభిమానంతో దేశీయంగా తాము కూడా ఎవరి శక్తి మేరకు వాళ్ళు నిధులు సమకూర్చేవారు. అలా నడుస్తూ వస్తుంది. NRI అభిమానులు తాము కూడా దీనికి నిధులు చేకూరుస్తామని చిరంజీవిని అడగటం జరిగింది.
అందుకు గాను FCRA ను సంప్రదించాలి. అనగా…. ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. ఈ సంస్థ భారతదేశంలో విదేశీ విరాళాలను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన సంస్థ. “విదేశీ విరాళాల (నియంత్రణ) చట్టం” ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశ్యం, విదేశీ విరాళాలు… దేశ సార్వభౌమత్వానికి, భద్రతకు, ప్రజా ప్రయోజనాలకు మరియు ప్రజాస్వామ్య ప్రక్రియలకు భంగం కలిగించకుండా నిరోధించడం. భారత దేశ సమైక్యతను కాపాడటం. దేశ వ్యాప్తంగా దేశ ద్రోహులకు, విచ్ఛిన్నకర శక్తులకు, కొన్ని ఉగ్రవాద శక్తులకు చాప కింద నీరులా వాళ్ళకి నిధులు సమకూరుస్తున్నాయని బెంగుళూరుకి చెందిన సంస్థలపై దాడులు కూడా జరిగాయి.
ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ ఫౌండర్ అయిన జార్జ్ సోరస్… ఈయన మోదీ ప్రభుత్వం ను దించేయడానికి నిధులు సమకూరుస్తున్నా అని ఓపెన్ గా ఒక సభలో చెప్పారు. ఇటువంటి నిధులు NGO ముసుగులో భారత దేశ సార్వ బౌమత్వానికి సవాలు విసురుతూ అభివృద్ధికి అడ్డు తగులుతున్నాయి అని ఆచి తూచి FCRA అనుమతి ఇస్తుంది.
ఇప్పుడు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కు FCRA అనుమతి లభించింది కాబట్టి…. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు, అందునా తెలుగు వారు విరాళాల రూపంలో బాసట గా నిలిస్తే…. మరింత మందికి విస్తృత స్థాయిలో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి.
చిరంజీవి లాంటి వ్యక్తి తెలుగు వాడు కావడం మన అదృష్టం… ఇంతమందికి కంటి చూపు, రక్తదానం అనే సేవ చేసే కారణంగా పుట్టిన “కారణజన్ముడు” చిరంజీవి.