సినిమా వార్తలు

తొలి అడుగును గుర్తుచేసుకున్న మెగాస్టార్ చిరంజీవి… ‘పునాదిరాళ్లు’ జ్ఞాపకాలతో భావోద్వేగ పోస్ట్

Published by
Srinivas

తన అద్భుత నటన, మెస్మరైజింగ్ డ్యాన్స్‌లు, పవర్‌ఫుల్ యాక్షన్‌తో కోట్లాది అభిమానులను అలరించిన మెగాస్టార్ Chiranjeevi తన సినీ ప్రయాణంలోని అమూల్యమైన జ్ఞాపకాన్ని అభిమానులతో పంచుకున్నారు.

దశాబ్దాలుగా అగ్ర కథానాయకుడిగా తెలుగు చిత్రసీమలో వెలుగొందుతున్న చిరంజీవి నటించిన తొలి చిత్రం Punadhirallu. ఈ సినిమా కోసం జీవితంలో మొదటిసారి కెమెరా ముందుకు నిలిచిన రోజు గుర్తుచేసుకుంటూ ఆయన సోషల్ మీడియాలో ఒక భావోద్వేగ పోస్టును షేర్ చేశారు.

“ఈరోజే ‘పునాదిరాళ్లు’ సినిమా కోసం జీవితంలో తొలిసారి కెమెరా ముందు నిలిచిన రోజు. ఆ రోజు నాలో కలిగిన ఆత్రుత, ఆనందం, బాధ్యత, భావోద్వేగం మాటల్లో చెప్పలేనిది. ఆ క్షణం ఇప్పటికీ నిన్నమొన్నటి సంఘటనలా అనిపిస్తుంది. ఒక అందమైన చందమామ కథలా ఆ అనుభూతి గుర్తుకొస్తోంది,” అని మెగాస్టార్ పేర్కొన్నారు.

అలాగే తనకు తొలి అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. “వారి నమ్మకం, ప్రోత్సాహంతో వచ్చిన ఆ అవకాశం నా నటన ప్రయాణానికి పునాదిరాళ్లుగా నిలిచింది,” అని అన్నారు.

ఆ తొలి అడుగు నుంచి ఈరోజు వరకూ తనను ఆదరిస్తూ, ఆశీర్వదిస్తున్న ప్రేక్షకులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అభిమానుల ప్రేమే తనకు అసలైన బలం అని మెగాస్టార్ మరోసారి వెల్లడించారు.

ఈ భావోద్వేగ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, అభిమానులు ఆయన సినీ ప్రయాణాన్ని స్మరించుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

Recent Posts