“బంకించంద్ర ఛటర్జీ” రచించిన గీతం వందేమాతరం, భారత స్వాతంత్ర్య ఉద్యమంలో దేశాన్ని ఏకతాటి పై నిలిపి కుల,మత,ప్రాంత భావాలకు అతీతంగా….అనాటి బ్రిటిష్ ప్రభుత్వం మీద ప్రతి భారతీయుడి కి జాతీయ స్ఫూర్తి కలిగించేలా అందరి పెదవులపై తారక మంత్రం అయ్యింది. రాసింది బంకించంద్ర ఛటర్జీ అయినా… “రవీంద్ర నాథ్ టాగోర్” దీనికి బాణీ కట్టి ప్రాచుర్యం లోకి తీసుకువచ్చారు.
తరువాత కాలం లో “కుదిరాం బోస్” అనే 18సం… విప్లవయోదుడికి బ్రిటిష్ ప్రభుత్వం మరణ శిక్ష విధించింది. అప్పుడు అతన్ని నువ్వు కోర్టుకు చెప్పేది ఏమైనా ఉందా అని అడిగినప్పుడు “వందే మాతరం” అని నినదాలిస్తూ సాగిపోతే …. మరణశిక్ష అనంతరం అతని పార్ధీవదేహాన్ని తీసుకువెళ్తుంటే… కలకత్తా నగరం మొత్తం “వందేమాతరం” నినాదాలతో హోరెత్తిపోయింది అని చరిత్రకారులు అనేక పుస్తకాలలో ఉటంకించారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఈ గేయాన్ని జాతీయగేయంగా భారత ప్రభుత్వం ఆమోదించింది.
ఇప్పుడు అసలు విషయానికి వద్దాం…. సామ్యూల్ కమలేశన్…. ఇండియన్ ఆర్మీలో కమాండింగ్ ఆఫీసర్…. ఆయన ను ఉద్యోగం నుండి తొలగించారు. ఎందుకంటే ఆర్మీలో ఉన్న రూల్స్ ప్రకారం ఆయన వద్ద ఉన్న సైనికులు ఎక్కువగా ఎవరు ఉంటారో వాళ్ళ యొక్క మత ఆచారాలను, పూజలను ఆ కమాండింగ్ ఆఫీసర్ ముందు ఉండి నిర్వహించాలి.
ముస్లిం ,హిందూ, క్రిస్టియన్ ఎవరైనా కావచ్చు…వాళ్ళు తన వద్ద ఎక్కువగా ఏ మతానికి చెందిన సైనికులు ఉంటే ఆ మత ఆచారాలను ఆయన విధిగా పాటించాలి…. అది ఆర్మీ లో ముఖ్యమైన నిబంధన, ఆయన వద్ద ఉన్న సైనికులలో అత్యధిక శాతం సిక్కులు ఉన్నారు…. వారి పవిత్ర గ్రంథం “గురు గ్రంథ సాహిబ్” అక్కడ వారి ఆచారాల ప్రకారం పూజలు చేసుకుంటారు. అక్కడ కు వస్తాను కాని పూజలలో పాలుపంచుకోను… నా మత విశ్వాసాలకు విరుద్ధంగా నేను ఆ పని చేయలేను అని నిష్కర్షగా చెప్పడంతో ఆయనను విధులను తొలగించారు.
ఆయన ఇదే విషయం పై హైకోర్టు ను ఆశ్రయించారు…. ఆయనకు అనుకూలంగా తీర్పు రాలేదు. సుప్రీంకోర్టు ను ఆశ్రయించారు… సుప్రీంకోర్టు కూడా మిమ్మల్ని విధులనుండి తొలగించడం సరి అయిన చర్య అని తీర్పు ఇచ్చింది.
ఇప్పుడు నెటిజన్లు ఈ చర్యను అంటే సామ్యూల్ కమలేసన్ ని ఎలాగయితే విధులనుండి తొలగించారో అలాగే రాజకీయాలలో చట్ట పరంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులు వందేమాతరం ఆలపించకుండా ….. భారత రాజ్యాంగం ఆమోదించిన “వందేమాతరం” గేయానికి.. గౌరవం ఇవ్వకుండా, స్వాతంత్ర్య సమరయోధుల అందించిన స్వేచ్ఛ ఫలాలను అనుభవిస్తూ…తమ మతానికే…ప్రాధాన్యమిస్తున్న వారిని కూడా ఆ పదవులనుండి తొలగించాలి అని అంటున్నారు.
“వందేమాతరం”