Download App

నితిన్ ‘అలియాస్ రుక్మిణి’ నుంచి ఫస్ట్ సింగిల్.. అక్టోబర్ 27న ‘రుక్కురుక్కు రుక్మిణి’ విడుదల!

అక్టోబర్ 24, 2026 • By Srinivas
న్యాచురల్ స్టార్ నాని యునానిమస్ ప్రొడక్షన్స్ నుంచి మరో ఆసక్తికరమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘కోర్ట్ – స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’ బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత ఈ సంస్థ నిర్మిస్తున్న తాజా చిత్రం ‘అలియాస్ రుక్మిణి’. నితిన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ‘దండోరా’...
నితిన్ ‘అలియాస్ రుక్మిణి’ నుంచి ఫస్ట్ సింగిల్.. అక్టోబర్ 27న ‘రుక్కురుక్కు రుక్మిణి’ విడుదల!

న్యాచురల్ స్టార్ నాని యునానిమస్ ప్రొడక్షన్స్ నుంచి మరో ఆసక్తికరమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘కోర్ట్ – స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’ బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత ఈ సంస్థ నిర్మిస్తున్న తాజా చిత్రం ‘అలియాస్ రుక్మిణి’. నితిన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ‘దండోరా’ ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వం వహిస్తున్నారు. దీప్తి గంటా నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే గ్లింప్స్, ఫస్ట్ లుక్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది.

అక్టోబర్ 27న ఫస్ట్ సాంగ్ రిలీజ్

‘అలియాస్ రుక్మిణి’ సినిమా నుంచి మ్యూజిక్ ప్రమోషన్స్‌ను ప్రారంభించేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా చిత్రంలోని తొలి పాట ‘రుక్కురుక్కు రుక్మిణి’ని అక్టోబర్ 27న విడుదల చేయనున్నారు. ఈ మేరకు రిలీజ్ చేసిన సాంగ్ అనౌన్స్‌మెంట్ పోస్టర్ ఆకట్టుకుంటోంది.

ఈ పోస్టర్‌లో నితిన్ ఫార్మల్ డ్రెస్‌లో కూల్ అండ్ స్టైలిష్‌గా కనిపించగా, హీరోయిన్ ఆఫియా సయ్యద్ సంప్రదాయ చీరకట్టులో అందంగా మెరిశారు. ఇద్దరి లుక్స్‌తో పాటు పోస్టర్‌లోని విజువల్స్ కూడా పాటపై ఆసక్తిని పెంచుతున్నాయి.

నితిన్ సరసన ఆఫియా సయ్యద్

ఈ సినిమాలో నితిన్‌కు జోడీగా ఆఫియా సయ్యద్ కథానాయికగా నటిస్తున్నారు. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు వచ్చిన స్పందనతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.

ఈ చిత్రానికి జోమోన్ టీ. జాన్ ఐఎస్‌సీ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, విజయ్ బుల్గానిన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా, సృజన అడుసుమిల్లి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.

డిసెంబర్ 4న ‘అలియాస్ రుక్మిణి’ థియేటర్లలో విడుదల కానుంది. ఫస్ట్ సింగిల్‌తో ప్రారంభం కానున్న మ్యూజిక్ ప్రమోషన్స్ సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేస్తాయేమో చూడాలి.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

View all posts

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading