Download App

‘ద్రౌపది 2’ నుంచి ‘తారాసుకి’… పీరియాడిక్ టచ్‌తో పవర్‌ఫుల్ ప్రెజెంటేషన్

జనవరి 7, 2026 Published by Rahul N

‘ద్రౌపది 2’ నుంచి ‘తారాసుకి’… పీరియాడిక్ టచ్‌తో పవర్‌ఫుల్ ప్రెజెంటేషన్

Draupathi 2పై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. Richard Rishi హీరోగా, Sola Shakkaravarthi నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే మంచి స్పందనను రాబట్టింది. ఈ సినిమాలో Rakshana Induchoodan హీరోయిన్‌గా నటిస్తుండగా, వీరి పాత్రల లుక్స్‌తో పాటు ముందుగా విడుదలైన ‘నెలరాజె..’ పాటకు సూపర్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

ఇప్పుడ తాజాగా బుధవారం రోజున ఈ సినిమా నుంచి ‘తారాసుకి..’ అనే కొత్త పాటను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటను మహ్మబీన్ తుగ్లక్ పాత్రలో నటిస్తున్న Chirag Janiపై ప్రత్యేకంగా చిత్రీకరించారు. ఈ సాంగ్ కోసం భారీ సెట్స్ వేసి, పీరియాడిక్ టచ్‌తో గ్రాండ్‌గా తెరకెక్కించడం విశేషం. ఎనర్జిటిక్ బీట్‌, విజువల్ స్కేల్‌తో ఈ పాట సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది.

సంగీత దర్శకుడు Ghibran అందించిన పవర్‌ఫుల్ కంపోజిషన్‌కు దర్శకుడు Mohan G సాహిత్యాన్ని అందించారు. ఈ పాటను గిబ్రాన్‌తో పాటు Gold Devaraj, Guru Hariraj ఆలపించారు. పీరియాడిక్ నేపథ్యానికి తగ్గట్టుగా పాటను విజువల్‌గా డిజైన్ చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

‘ద్రౌపది 2’ నుంచి ‘తారాసుకి’… పీరియాడిక్ టచ్‌తో పవర్‌ఫుల్ ప్రెజెంటేషన్

ఈ చిత్రంలో Natti Natraj కీలక పాత్రలో నటిస్తుండగా, Y G Mahendran, Nadodigal Barani, Saravana Subbiah, Vel Ramamoorthy, Siraj Johnny, Dinesh Lamba, Ganesh Gaurang, Divi, Devayani Sharma, Arunodayan తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

సాంకేతికంగా కూడా ద్రౌపది 2 బలంగా ఉంది. సినిమాటోగ్రఫీని Philip R Sundar నిర్వహిస్తుండగా, ఎడిటింగ్ బాధ్యతలను Devaraj చేపట్టారు. యాక్షన్ సన్నివేశాలను Action Santosh డిజైన్ చేయగా, నృత్యాలను Thanika Tony కంపోజ్ చేశారు. ప్రొడక్షన్ డిజైనర్‌గా Kamalnathan పని చేస్తున్నారు. డైలాగ్స్‌ను పద్మ చంద్రశేఖర్‌తో పాటు మోహన్ జి రచించారు.

సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ద్రౌపది 2 నుంచి త్వరలోనే ట్రైలర్‌ను విడుదల చేసి, ఆడియో లాంచ్ ఈవెంట్‌ను కూడా ఘనంగా నిర్వహించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయాలని ప్లాన్ చేస్తుండగా, సినిమా రిలీజ్ డేట్‌పై అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రానుందని చిత్ర బృందం తెలిపింది.

నేతాజి ప్రొడక్షన్స్, జిఎం ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading