Download App

“అన్న మా థియేటర్లో తప్పు ప్రింట్ వేసారనుకుంటా…” ప్రొడ్యూసర్ SKNని ఏకిపారేస్తున్న ఫాన్స్

జనవరి 10, 2026 By Rahul N
ఇండియాలోనే బిగ్గెస్ట్ హారర్ ఫాంటసీ మూవీగా ప్రచారం పొందిన The Raja Saab ప్రీమియర్ టాక్ బయటకు వచ్చిన వెంటనే రివ్యూలు, రేటింగులు వెల్లువెత్తాయి. ఇప్పటివరకు ప్రేక్షకుల నుంచి సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది. కొంతకాలంగా మాస్ యాక్షన్ చిత్రాలతో కనిపించిన Prabhas ఈసారి పూర్తిగా భిన్నమైన హారర్–కామెడీ...
"థియేటర్లలో మాకు వేరే సినిమాని వేసారా?…" ప్రొడ్యూసర్ SKNని ఏకిపారేస్తున్న ఫాన్స్

ఇండియాలోనే బిగ్గెస్ట్ హారర్ ఫాంటసీ మూవీగా ప్రచారం పొందిన The Raja Saab ప్రీమియర్ టాక్ బయటకు వచ్చిన వెంటనే రివ్యూలు, రేటింగులు వెల్లువెత్తాయి. ఇప్పటివరకు ప్రేక్షకుల నుంచి సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది.

కొంతకాలంగా మాస్ యాక్షన్ చిత్రాలతో కనిపించిన Prabhas ఈసారి పూర్తిగా భిన్నమైన హారర్–కామెడీ జోనర్‌లో నటించడంతో అంచనాలు పెరిగాయి. ట్రైలర్ 2.0 ఆసక్తిని మరింత పెంచినా, థియేటర్లలో సినిమా ఆ అంచనాలను పూర్తిగా అందుకోలేకపోయిందనే అభిప్రాయాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

దర్శకుడు Maruthi మంచి కాన్సెప్ట్ ఎంచుకున్నప్పటికీ, స్క్రీన్‌ప్లే బలహీనంగా ఉందని, ఫస్ట్ హాఫ్ స్లోగా సాగిందని, పాటలు అనవసరంగా అనిపించాయని ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. ప్రభాస్ యాక్టింగ్, కామెడీ టైమింగ్ ప్రశంసలు అందుకున్నప్పటికీ, స్టోరీ టెల్లింగ్ వీక్‌గా ఉందన్న విమర్శలు ఉన్నాయి. ప్రీ ఇంటర్వెల్, క్లైమాక్స్ కొంతవరకు బాగున్నాయన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.

ది రాజా సాబ్ సినిమాపై విడుదలకు ముందే భారీ హైప్ క్రియేట్ చేసిన క్రియేటివ్ ప్రొడ్యూసర్ SKN టీజర్ రిలీజ్ టైమ్ నుంచి, ఆ తరువాత కూడా పలు సందర్భాల్లో సినిమాను ఆకాశానికెత్తేశారు. ప్రీమియర్ షోలపై చేసిన ప్రచారానికి హైదరాబాద్ నగరమంతా ప్రభాస్ అభిమానులు థియేటర్ల వద్ద పడిగాపులు కాసారు. తీరా అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రీమియర్లు ప్రారంభమయ్యాయి.

ఇదిలా ఉండగా, విడుదల రోజున ఎస్‌కేఎన్ చేసిన ట్వీట్ ఇప్పుడు ట్రోలింగ్‌కు కేంద్రబిందువుగా మారింది. ప్రభాస్–మారుతి కలయికలో వచ్చిన ఈ సినిమా తనను ఇంకా ట్రాన్స్‌లో ఉంచిందని, హీరో–నాన్నమ్మ మధ్య సన్నివేశాలు సినిమాకి గుండెకాయలాంటివని, చివరి 40 నిమిషాల్లో Thaman S నెక్స్ట్ లెవల్ మ్యూజిక్ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.

అయితే, ఎన్నో ఆశలతో సినిమా చూసిన అభిమానుల్లో చాలామంది నిరాశకు గురయ్యారు. ఫలితంగా, నిన్న ఉదయం నుంచే సోషల్ మీడియాలో ప్రొడ్యూసర్ SKNపై ట్రోలింగ్ మోత మొదలైంది.

దీనిపై నెటిజన్లు….
“ఇంతకీ నిర్మాత ఏ సినిమా చూశాడు?”
“అన్న మా థియేటర్ లో తప్పు ప్రింట్ వేసారనుకుంటా…?”
అంటూ కొంత మంది అభిమానులు సెటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు.

ఫస్ట్ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో ప్రొడ్యూసర్ SKN ‘జాతిని!’ అని ప్రింట్ చేసిన టీషర్ట్ వేసుకొని హంగామా చేశారు. అంతేకాక ప్రీరిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ.. ”ఎప్పుడూ కోళ్లపై పందెం వేస్తారు. ఈసారి మీరు డైనోసార్ మీద పందెం వేయబోతున్నారు. రాసిపెట్టుకోండి.. మాస్ ధమాకా. పండక్కి వస్తున్నాం.. పండక్కి చేస్తున్నాం.. ఇది ఫిక్స్” అని అన్నారు. అయితే ఇప్పుడు సినిమా ఆయన చెప్పినట్లుగా లేదని నెటిజన్లు ఎస్‌కేఎన్ ను విమర్శిస్తున్నారు. ఈయన ఇప్పుడు ఎక్కడ ఉన్నాడంటూ మరికొంత మంది విరుచుకు పడుతున్నారు.

విడుదలకు ముందు “3 గంటల 10 నిమిషాల మాస్ ధమాకా” అంటూ ఇచ్చిన ఓవర్ హైప్ మాటలే ఇప్పుడు ట్రోలింగ్‌గా మారాయని చెప్పుకోవచ్చు.

మొత్తానికి, భారీ అంచనాల మధ్య విడుదలైన ‘ది రాజాసాబ్’ సినిమా కంటే, నిర్మాత వ్యాఖ్యలు మరియు వాటిపై నెటిజన్ల స్పందన సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతోంది. రాబోయే రోజుల్లో వర్డ్ ఆఫ్ మౌత్ ఎలా మారుతుందో, బాక్సాఫీస్ ప్రయాణం ఏ దిశగా సాగుతుందో చూడాల్సి ఉంది.

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading