
డాషింగ్ డైరెక్టర్ Puri Jagannadh దర్శకత్వంలో, పవర్ హౌస్ పెర్ఫార్మర్ Vijay Sethupathi హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా మూవీ Slum Dog 33 Temple Road పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, Charmy Kaur, జేబీ మోహన్ పిక్చర్స్‌కు చెందిన జేబీ నారాయణరావు కొండ్రోల్లాతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ముఖ్యంగా రీ-రికార్డింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ‘అర్జున్ రెడ్డి’, Animal వంటి చిత్రాలకు అద్భుతమైన సంగీతం అందించిన జాతీయ అవార్డు గ్రహీత Harshavardhan Rameshwar ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
తాజాగా మేకర్స్ విడుదల చేసిన ఫోటోలో పూరి జగన్నాథ్ స్వయంగా మ్యూజిక్ డైరెక్టర్‌తో కలిసి రికార్డింగ్ స్టూడియోలో కూర్చొని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పనులను పర్యవేక్షిస్తున్నట్లు కనిపించారు. ఈ స్టిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచుతోంది.

పూరి మార్క్ ఇంటెన్స్ ఎమోషన్స్, రా యాక్షన్‌కు తగ్గట్టుగానే ఈ చిత్రానికి పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఉండబోతుందనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఇప్పటికే ఈ ఎక్స్‌ప్లోసివ్ కాంబినేషన్‌పై భారీ హైప్ నెలకొనగా, మేకర్స్ త్వరలోనే మరిన్ని స్ట్రైకింగ్ అప్‌డేట్స్ ఇవ్వనున్నట్లు సమాచారం.
ఈ చిత్రంలో విజయ్ సేతుపతి సరసన Samyuktha హీరోయిన్‌గా నటిస్తుండగా, Tabu కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే Brahmaji, VTV Ganesh హాస్యభరిత పాత్రల్లో అలరించనున్నారు.
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం గ్రాండ్ పాన్-ఇండియా స్థాయిలో విడుదల కానుంది.
