సినిమా వార్తలు

దుల్కర్ కెరీర్‌లోనే అత్యంత స్టైలిష్ మూవీగా ‘ఐ యామ్ గేమ్’

Published by
Srinivas

దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ “ఐ యామ్ గేమ్” ప్రస్తుతం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తున్న చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. దక్షిణ భారతదేశంలోని 100కు పైగా లొకేషన్లలో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగంగా జరుపుకుంటోంది.

తాజాగా ఈ సినిమా గురించి మాట్లాడిన దుల్కర్ సల్మాన్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తన సినీ కెరీర్‌లో ఇప్పటివరకు చేసిన సినిమాల్లో “ఐ యామ్ గేమ్”నే అత్యంత స్టైలిష్ మూవీ అని ఆయన తెలిపారు. సినిమాలో తన పాత్రతో పాటు మొత్తం కథా ప్రపంచాన్ని చాలా మోడర్న్ మరియు స్టైలిష్‌గా డిజైన్ చేశారని చెప్పారు.

దర్శకుడు నహాస్ హిదాయత్ ప్రత్యేకంగా తనను కొత్త స్టైలిష్ అవతార్‌లో చూపించాలని భావించారని, అదే ఈ ప్రాజెక్ట్‌కు ప్రధాన ఆకర్షణగా మారిందని దుల్కర్ వెల్లడించారు. ఇటీవల తన సినిమాల్లో ఎక్కువగా వింటేజ్ లుక్స్‌లో కనిపించిన తాను, ఈసారి పూర్తిగా భిన్నమైన మాస్ యాక్షన్ స్టైలిష్ పాత్రలో కనిపించనున్నట్లు తెలిపారు.

బ్లాక్‌బస్టర్ “ఆర్‌డీఎక్స్” తర్వాత నహాస్ హిదాయత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం 2026 ఆగస్టులో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. దుల్కర్ సల్మాన్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా, మలయాళ సినీ పరిశ్రమలో కూడా అత్యంత భారీ రిలీజ్‌లలో ఒకటిగా నిలవనుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

వే ఫారర్ ఫిలిమ్స్ బ్యానర్‌పై దుల్కర్ సల్మాన్, జోమ్ వర్గీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షహబాస్ రషీద్, ఆదర్శ్ సుకుమారన్ కథా రచన అందిస్తున్నారు. “లోకా” వంటి భారీ విజయానంతరం వే ఫారర్ ఫిలిమ్స్ నుంచి వస్తున్న తదుపరి ప్రతిష్టాత్మక చిత్రం ఇదే కావడం విశేషం.

ఇక ఈ సినిమాలో ఆంటోని వర్గీస్, మైస్కిన్, కాయదు లోహర్, కతిర్, పార్థ్ తివారి, సంయుక్త విశ్వనాథన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తుండగా, ప్రముఖ స్టంట్ డ్యుయో అన్బరివ్ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, సెకండ్ లుక్ పోస్టర్లు సోషల్ మీడియాలో మంచి స్పందనను తెచ్చుకుని సినిమాపై భారీ బజ్‌ను క్రియేట్ చేశాయి. “ఐ యామ్ గేమ్” మలయాళం, తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

Recent Posts