సినిమా వార్తలు

నార్త్ అమెరికాలో ‘పెద్ది’ సంచలనం… 4 గంటల్లోనే 100K డాలర్లు!

Published by
Srinivas

Ram Charan హీరోగా, Buchi Babu Sana దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా చిత్రం Peddi విడుదలకు ముందే భారీ సంచలనాలు సృష్టిస్తోంది. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ భారీ చిత్రం నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్‌తో రికార్డులు బద్దలు కొడుతోంది.

ట్రైలర్ విడుదల కాకముందే ‘పెద్ది’పై ప్రేక్షకుల్లో ఏర్పడిన అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో బుకింగ్స్ స్పష్టంగా చూపిస్తున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైన కేవలం నాలుగు గంటల్లోనే ఈ సినిమా 100K డాలర్ల మార్క్‌ను దాటేసి ఆల్‌టైమ్ రికార్డ్ నమోదు చేయడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.

రామ్ చరణ్ స్టార్ పవర్‌తో పాటు బుచ్చిబాబు సానా కథ చెప్పే విధానంపై ప్రేక్షకుల్లో ఉన్న నమ్మకం ఈ భారీ హైప్‌కు ప్రధాన కారణంగా మారింది. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు, రెండు గ్లింప్స్, పోస్టర్లు సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి. ముఖ్యంగా రస్టిక్ మూడ్, గ్రామీణ నేపథ్యం, రామ్ చరణ్ రగ్గ్డ్ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

నార్త్ అమెరికా రిలీజ్‌ను ప్రత్యంగిరా సినిమాస్ భారీ స్థాయిలో ప్లాన్ చేస్తోంది. కేవలం అమెరికాలోనే కాదు.. శ్రీలంక, ఆస్ట్రేలియా, సింగపూర్ సహా పలు దేశాల్లో ఈ చిత్రాన్ని గ్రాండ్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇప్పటికే సిద్ధమైన థియేట్రికల్ ట్రైలర్ విడుదలైన తర్వాత ఈ హైప్ మరింత రెట్టింపు అవుతుందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.

వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని Mythri Movie Makers మరియు సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి.

‘పెద్ది’ ప్రపంచవ్యాప్తంగా జూన్ 4న భారీ స్థాయిలో విడుదల కానుండగా.. జూన్ 3 నుంచే ప్రీమియర్ షోలు ప్రారంభం కానున్నాయి.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.