అన్నపూర్ణ స్టూడియోస్ సినిమా పంపిణీ రంగంలో ఉన్నప్పటికీ… ఇప్పుడు ఇనుమడించిన ఉత్సాహంతో… సరికొత్త వేగంతో… దూకుడుగా పంపిణీ రంగంలోకి వస్తున్నారు… అనే ఒక వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతుంది. ఇండస్ట్రీ లో ఉన్న అగ్ర హీరోలు కొంతమంది తెర వెనుక ఉన్నారని సమాచారం. అన్నపూర్ణ స్టూడియో మరియు సితార ఎంటర్టైన్మెంట్ నాగ వంశీ తో కలసి వస్తున్నారు అని అంటున్నారు… మైత్రి మూవీస్ బ్యానర్ లో రాగల రెండు సంవత్సరాల కాలంలో వచ్చే భారీ బడ్జెట్ మూవీస్ అన్ని కూడా కొత్తగా రాబోతున్న ఈ సిండికేట్ ద్వారా పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నారని తెలుస్తుంది.
మైత్రి మూవీస్ తో కలసి , సితార ఎంటర్టైన్మెంట్, అన్నపూర్ణ స్టూడియోస్… ఒక అవగాహనతో ఆంధ్రా, సీడెడ్, నైజాం, ఓవర్సీస్ లలో పంపిణీ రంగంలోకి ప్రవేశిస్తున్నారు అని సినీ వర్గాల భోగట్టా.
ఇప్పటికే ఉన్న ఒక పంపిణీ సంస్థ సరిగ్గా నైజాంలో తన సినిమాని సరిగ్గా పంపిణీ చేయలేదని, తగినన్ని థియేటర్స్ లో వేయలేకపోయిందని, ఆ సంస్థ మీద హీరో కినుక వహించారని, దాని ఫలితమే ఈ పంపిణీ సంస్థ పురుడు పోసుకోవడానికి కారణం అని ఫిల్మ్ నగర్ లో వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే ఉన్న ఒక ప్రముఖ పంపిణీ సంస్థ, చిత్ర విడుదల సమయంలో పూర్తిగా డబ్బు కట్టడం లేదని, (కట్ట లేకపోవడం) ఎంతో కొంత అమౌంట్ పెండింగ్ లో ఉంచడం… చిన్న హీరోల చిత్రాలకు థియేటర్లు ఇవ్వకుండా విసిగించి తమ వద్దకు వాళ్లే వచ్చేటట్టుగా చేయడంతో చిన్న హీరోలు విసిగి పోయినట్లుగా తెలుస్తోంది… దాని పర్యవసానమే ఈ సంస్థ నెలకొల్పడానికి కారణం గా తెలుస్తుంది.
ఇప్పటికే ఉన్న రెండు అగ్ర నిర్మాణ సంస్థలు, పంపిణీ రంగంలో నెమ్మదిగా ఉండటం… మైత్రి మూవీస్ కాస్త వేగంగా ఉండటంతో… వీళ్లతో కలసి ముందుకు వెళుతున్నారట అన్నపూర్ణ స్టూడియోస్… సమగ్రమైన ప్రణాళికతో చిన్న నిర్మాతలకు, వాళ్ళ సినిమాలకు ప్రాముఖ్యత నిస్తూ, ఆ చిత్రాలను పంపిణీ చేస్తూ థియేటర్స్ కి, ఫీడింగ్ ఇబ్బంది కలగకుండా గట్టి చర్యలను తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఈ చర్యల ద్వారా ఇండస్ట్రీ పచ్చగా నాలుగు కాలాలు బాగుండేలా వ్యవహరించబోతున్నట్లుగా ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.
ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే ఒక మెగా హీరో అండదండలు , ఆశీస్సులు బలంగా ఉన్నాయట… ఇలా హీరోలు ఇండస్ట్రీ బాగు కోసం నడుం బిగించడం నిజంగా గర్వించే విషయమే.